వడోదర: విజయ్ హజారే ట్రోఫీలో విదర్భ ఫైనల్కు దూసుకెళ్లింది. గురువారం వడోదరలో జరిగిన రెండో సెమీస్లో విదర్భ.. మహారాష్ట్రపై 69 పరుగుల తేడాతో గెలిచింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన విదర్భ.. 50 ఓవర్లలో 380/3 పరుగుల భారీ స్కోరు చేసింది.
ఓపెనర్లు ధ్రువ్ (114), యశ్ (116) తొలి వికెట్కు 224 పరుగులు జోడించారు. సారథి కరుణ్ నాయర్ (88), జితేశ్ (51) రెచ్చిపోయి ఆడటంతో ఆ జట్టు భారీ స్కోరు చేసింది. అనంతరం ఛేదనలో మహారాష్ట్ర.. 50 ఓవర్లలో 311/7కే పరిమితమైంది. అర్షిన్ కులకర్ణి (90), అంకిత్ (50) పోరాడారు. ఈనెల 18న కర్నాటక, విదర్భ ఫైనల్లో అమీతుమీ తేల్చుకోనున్నాయి.