HomeSportsVictory Moments Indian Players Erupt In Celebration After Historic Icc Womens World Cup Win Harmanpreet Dances
ICC Women’s World Cup | సరికొత్త చరిత్రను లిఖించిన టీమిండియా.. ఐసీసీ వన్డే వరల్డ్ కప్ విజేతల సంబరాల ఫొటోలు మీరూ చూసేయండి..!
ICC Women's World Cup | భారత వుమెన్స్ క్రికెట్ జట్టు సరికొత్త చరిత్రను లిఖించింది. దశాబ్దాల చిరకాల కలను సాకారం చేసింది. రెండుసార్లు ఫైనల్లో ఓడిన వుమెన్స్ ఇన్ బ్లూ.. మూడోసారి ప్రపంచకప్ ఫైనల్ చేరిన జట్టు తొలిసారిగా ప్రపంచకప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. కోట్లాది మంది అభిమానుల ఆశలను నెరవేరుస్తూ వన్డే వరల్డ్ కప్‌లో కొత్త ఛాంపియన్‌గా భారత జట్టు నిలిచింది.
ICC Women’s World Cup | భారత వుమెన్స్ క్రికెట్ జట్టు సరికొత్త చరిత్రను లిఖించింది. దశాబ్దాల చిరకాల కలను సాకారం చేసింది.
రెండుసార్లు ఫైనల్లో ఓడిన వుమెన్స్ ఇన్ బ్లూ.. మూడోసారి ప్రపంచకప్ ఫైనల్ చేరిన జట్టు తొలిసారిగా ప్రపంచకప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది.
కోట్లాది మంది అభిమానుల ఆశలను నెరవేరుస్తూ వన్డే వరల్డ్ కప్‌లో కొత్త ఛాంపియన్‌గా భారత జట్టు నిలిచింది.
భారత దిగ్గజ ఆటగాడు కపిల్ దేవ్, ఎంఎస్ ధోనీ తర్వాత భారత్‌కు వన్డే వరల్డ్ కప్ అందించిన మూడో కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్ ఘనత సాధించింది.
నవీ ముంబయిలోని డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ వేదికగా జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై 52 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో రాణించి తొలిసారిగా జగజ్జేతగా నిలిచింది.
తొలిసారిగా ప్రపంచకప్ ఫైనల్ చేరిన దక్షిణాఫ్రికా జట్టు.. దేశానికి తొలి వన్డే ప్రపంచకప్ సాధించాలన్న ఆకాంక్ష నెరవేరలేదు.
కెప్టెన్ లారా వోల్వార్ట్ అద్భుతమైన సెంచరీ సాధించినా జట్టును గెలిపించలేకపోయింది.
మ్యాచ్‌లో విజయం అనంతరం ఆటగాళ్లు సంబరాల్లో మునిగి తేలారు.
పలువురు ఆటగాళ్లు భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. టీమిండియా మాజీ కెప్లెన్లు మిథాలీరాజ్, అంజుమ్ చోప్రా ఆటగాళ్లతో కలిసి సంబురాల్లో పాల్గొన్నారు.
సంబరాల్లో టీమిండియా క్రికెటర్లు, సహాయక సిబ్బంది
ప్రపంచకప్ అందుకునేందుకు డ్యాన్స్ చేస్తూ వేదికపైగా కెప్టెన్ హర్మన్‌ప్రీత్
శుభాకాంక్షలు తెలుపుతున్న ఐసీసీ చైర్మన్ జైషా
సంబురాల్లో టీమిండియా క్రికెటర్లు
సంబురాల్లో టీమిండియా క్రికెటర్లు
సంబురాల్లో టీమిండియా క్రికెటర్లు
ప్రపంచకప్‌తో హెడ్‌కోచ్ అమోల్ మజుందార్
ప్రపంచకప్‌తో మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్
సంబురాల్లో అంజుమ్ చోప్రా
భావోద్వేగానికి గురైన మాజీ ఫాస్ట్ బౌలర్ ఝులన్ గోస్వామి