Spirit Of Cricket : ఫుట్‌బాల్, క్రికెట్ ఏదైనా సరే ఆటలో క్రీడా స్ఫూర్తి(Spirit Of Cricket)ని ప్రదర్శించడం ఎంతో ముఖ్యం. అయితే.. ఈ మధ్య క్రికెట్లో తరచూ ఈ పదం చర్చనీయాంశమవుతోంది. భారత గడ్డపై ముగిసిన వన్డే వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబుల్ హసన్.. శ్రీలంక ఆల్‌రౌండర్ ఏంజెల్ మాథ్యూస్ టైమ్డ్ ఔట్ (Timed Out) కోసం అప్పీల్ చేయడం వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఆస్ట్రేలియా ఫస్ట్ క్లాస్ ఆటగాళ్లు క్రీడా స్ఫూర్తితో అందరి మెప్పు పొందుతున్నారు. షెఫీల్డ్ షీల్డ్(Sheffield Shield)లో భాగంగా ఆడిలైడ్ స్టేడియంలో విక్టోరియా జట్టు కెప్టెన్ విల్ సథర్లాండ్ స్పిరిట్ ఆఫ్ క్రికెట్‌ను నిలబెట్టాడు.
అసలేం జరిగిందంటే..? రెండో రోజు మ్యాచ్ కొనసాగుతున్న సమయంలో దక్షిణాఫ్రికా బ్యాటర్ జేక్ ఫ్రేజర్ మెక్ గర్క్ 18 పరుగుల వద్ద డౌగ్ వారెన్ బౌలింగ్‌లో ఫస్ట్ స్లిప్‌లో క్యాచ్ ఇచ్చాడు. బంతి అందుకున్న పీటర్ హ్యాండ్స్కాంబ్తో సహా విక్టోరియా ఆటగాళ్లు గట్టిగా అప్పీల్ చేయడంతో అంపైర్ అతడిని ఔట్ ఇచ్చాడు. దాంతో, ఫ్రేజర్ నిరాశగా పెవిలియన్ బాట పట్టాడు.
Bizarre scenes at Adelaide Oval as Jake Fraser-McGurk is given out caught, but is allowed to keep batting moments later 😲 #SheffieldShield pic.twitter.com/WaDPTGYkt3
— cricket.com.au (@cricketcomau) November 29, 2023
అయితే.. రీప్లేలో బంతి బ్యాట్‌కు తగలలేదని తేలింది. వికెట్ కీపర్‌కు కూడా ఎలాంటి శబ్దం వినిపించలేదు. దాంతో, విక్టోరియా సారథి విల్ జట్టు సభ్యులతో కాసేపు చర్చించి అప్పీల్‌ను వెనక్కి తీసుకున్నాడు. దాంతో, ఫ్రేజర్ మళ్లీ బ్యాటింగ్ కొనసాగించాడు. ఈ మ్యాచ్‌లో విక్టోరియా కెప్టెన్ విల్ క్రీడా స్ఫూర్తిని మాజీ క్రికెటర్లతో పాటు అభిమానులు ప్రశంసిస్తున్నారు.