IPL 2023 : పదహారో సీజన్ ఐపీఎల్(IPL 2023 )లో వెటరన్ ఆటగాళ్లు సత్తా చాటుతున్నారు. వయసు పైబడిన చేవ తగ్గలేదని నిరూపిస్తున్నారు. బౌలింగ్, బ్యాటింగ్‌లో యువకులతో పోటీ పడుతున్నారు. కీలక సమయాల్లో జట్టును ఆదుకుంటూ మ్యాచ్ విన్నర్లుగా నిలుస్తున్నారు. అనుభవాన్నంతా ఉపయోగించి తోటి ఆటగాళ్లలో స్ఫూర్తిని రగిలిస్తున్నారు.
భారత జట్టు గొప్ప విజయాల్లో భాగమైన ఇషాంత్ శర్మ(Ishant Sharma), అమిత్ మిశ్రా(Amit Mishra), పీయూష్ చావ్లా(Piyush Chawla), మోహిత్ శర్మ(Mohit Sharma), అజింక్యా రహానే(Ajinkya Rahane).. ఈ సీజన్లో అదరగొడుతున్నారు. నిలకడగా రాణిస్తూ తుది జట్టులో చోటు దక్కించుకుంటున్నారు. వీళ్ల ప్రదర్శన ఎలా ఉందో చూద్దాం.
చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడుతున్న అజింక్యా రహానే రఫ్ఫాడిస్తున్నాడు. క్రీజులోకి రావడమే ఆలస్యం ఫోర్లు, సిక్స్‌లతో చెలరేగుతున్నాడు. వరుస హాఫ్ సెంచరీలతో కీలక ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు. ముంబై ఇండియన్స్‌పై దంచి కొట్టిన అతను ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై రహానే మెరుపు బ్యాటింగ్ చేశాడు. కేవలం 29 బంతుల్లోనే 71 రన్స్ కొట్టాడు. రహానే ఇప్పటి వరకు 52.25 సగటు, 199.04 స్ట్రైక్‌రేటుతో 209 పరుగులు చేశాడు. దాంతో, అతడికి భారత సెలక్షర్ల నుంచి పిలువు వచ్చింది. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ జట్టుకు రహానే ఎంపికయ్యాడు. ఈమధ్యే బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ జాజితాలో ఏ గ్రేడ్ నుంచి బి గ్రేడ్‌కు పడిపోయిన విషయం తెలిసిందే.
అజింక్యా రహానే – చెన్నై సూపర్ కింగ్స్
ఈ పొడగరి బౌలర్ ఒకప్పుడు ఆస్ట్రేలియన్లకు.. ముఖ్యంగా రికీ పాంటింగ్‌కు వణుకు పుట్టించాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన అతను ఐపీఎల్లో సత్తా చాటుతున్నాడు. ఈసారి ఇషాంత్ శర్మ ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. పొదుపుగా బౌలింగ్ చేస్తున్న ఇషాంత్ పంజాబ్ కింగ్స్‌పై సూపర్ స్పెల్‌తో ఆకట్టకున్నాడు. రెండు కీలక వికెట్లు తీసి పంజాబ్‌ను దెబ్బకొట్టాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఒక వికెట్ పడగొట్టాడు.
ఇషాంత్ శర్మ – ఢిల్లీ క్యాపిటల్స్
వెటరన్ బౌలర్ మోహిత్ శర్మ ఈ సీజన్లో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటన్స్ తరఫున ఆడుతున్నాడు. తొలి మ్యాచ్‌లోనే ఆకట్టుకున్న అతను లక్నోపై అద్భతం చేశాడు. హాఫ్ సెంచరీతో ఊపుమీదున్న కేఎల్ రాహుల్, డేంజరస్ స్టోయినిస్‌ను 20వ ఓవర్లో ఔట్ చేశాడు. కేవలం నాలుగు పరుగులే ఇచ్చి గుజరాత్‌ను గెలిపించాడు. గత సీజన్లో అతను చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడాడు.
మోహిత్ శర్మ – గుజరాత్ టైటన్స్
ముంబై ఇండియన్స్‌కు ఆడుతున్న సీనియర్ స్పిన్నర్ పీయూష్ చావ్లా వికెట్ల వేట కొనసాగిస్తున్నాడు. వికెట్ అవసరమైనప్పుడల్లా కెప్టెన్ రోహిత్ శర్మ అతడికి బంతి ఇస్తున్నాడు. అతను సారథి నమ్మకాన్ని వమ్ము చేయకుండా వికెట్ తీస్తున్నాడు. ఆర్సీబీపై పీయూష్ 3 వికెట్లతో ఆకట్టుకున్నాడు. ఇప్పటి వరకు 6 మ్యాచుల్లో 9 వికెట్లు పడగొట్టాడు.
పీయూష్ చావ్లా – ముంబై ఇండియన్స్
నలభై ఏళ్ల వయసులో ఐపీఎల్ ఆడుతున్న అమిత్ మిశ్రా సత్తా చాటుతున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న అతను కీలక సమయాల్లో వికెట్లు తీస్తున్నాడు. తన అనుభవంతో లక్నో విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు.
అమిత్ మిశ్రా – లక్నో సూపర్ జెయింట్స్