Sunil Gavaskar | అతడు ఢిల్లీ కెప్టెన్ అయితే టీమిండియాకు లాభం : గావస్కర్
Sunil Gavaskar : ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్సీపై లెజెండరీ క్రికెటర్ సునీల్ గావస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. డేవిడ్ వార్నర్(David Warner) బదులు సూపర్ ఫామ్‌లో ఉన్న ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్(Axar Patel)కు సారథ్య బాధ్యతలు అప్పగించాలని అతను అభిప్రాయపడ్డాడు.
Sunil Gavaskar : పదహారో సీజన్ ఐపీఎల్లో (IPL 2023) పేలవ ప్రదర్శన చేస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఎట్టకేలకు జోరు అందుకుంది. వరుసగా రెండు విజయాలు సాధించింది. అయితే.. ఆ జట్టు కెప్టెన్సీపై లెజెండరీ క్రికెటర్ సునీల్ గావస్కర్(Sunil Gavaskar) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. డేవిడ్ వార్నర్(David Warner) బదులు సూపర్ ఫామ్‌లో ఉన్న ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్(Axar Patel)కు సారథ్య బాధ్యతలు అప్పగించాలని అతను అభిప్రాయపడ్డాడు.
అక్షర్‌ను ఢిల్లీ కెప్టెన్ చేస్తే అది టీమిండియాకు ఎంతో లాభమని ఈ మాజీ క్రికెటర్ తెలిపాడు. ‘అక్షర్ ఎంతో నిజాయితీపరుడు. అతను ఉత్తమ ఫామ్‌లో ఉన్నాడు. అతడిని ఢిల్లీ కెప్టెన్‌గా రాణిస్తే అది భారత జట్టుకు ఎంతో ఉపయోగకరం’ అని ఈ లిటిల్ మాస్టర్ తెలిపాడు. ప్రస్తుత సీజన్లో అక్షర్ అదరగొడుతున్నాడు. ఢిల్లీ తరఫున అత్యధిక పరుగులు, వికెట్లు తీసిన రెండో ఆటగాడు అతనే కావడం విశేషం. రెగ్యులర్ కెప్టెన్ రిషభ్ పంత్(Rishabh Pant) కారు యాక్సిడెంట్లో గాయపడిన విషయం తెలిసిందే. దాంతో, అతడి ప్లేస్‌లో ఢిల్లీ యాజమాన్యం వార్నర్‌ను కెప్టెన్‌గా, అక్షర్‌ను వైస్ కెప్టెన్‌గా చేసింది.
34 రన్స్, 2 వికెట్లు
వైస్ కెప్టెన్‌గా ఉన్న అక్షర్ ఢిల్లీ గెలిచిన రెండు మ్యాచుల్లో విలువైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఉప్పల్ స్టేడియంలో నిన్న రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 34 రన్స్ చేశాడు. 62 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన అతను మనీశ్ పాండే(34)తో కలిసి బాధ్యతగా ఆడాడు. దాంతో, డేవిడ్ వార్నర్ 144 రన్స్ చేయగలిగింది. ఆ తర్వాత బంతితోనూ చెలరేగి రెండు కీలక వికెట్లు తీశాడు. ఇంపాక్ట్ ప్లేయర్ ముకేశ్ కుమార్ ఆఖరి ఓవర్లో కేవలం 6 పరుగులే ఇవ్వడంతో ఢిల్లీ 7 పరుగుల తేడాతో గెలుపొందింది. వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది.
స్వదేశంలో ఇరగదీశాడు
స్వదేశంలో శ్రీలంక, న్యూజిలాండ్ సిరీస్‌లలో అక్షర్ పటేల్ బ్యాటుతో, బంతితో రాణించాడు. సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా లేని లోటు పూడ్చాడు. బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలోని ఈ లెగ్ స్పిన్నర్ ఆకట్టుకున్నాడు. భవిష్యత్తులో అతడు భారత జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగే అవశాశం ఉంది. ఈ నేపథ్యంలో గావస్కర్ ఇలాంటి కామెంట్స్ చేశాడనిపిస్తోంది.
ఇవి కూడా చదవండి
World Test Championship Final: రోహిత్ సేనలో రహానే.. టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌కు జట్టును ప్రకటించిన బీసీసీఐ
Shoaib Malik – Sania Mirza | అందుకే మేం కలవలేకపోతున్నాం.. విడాకుల పుకార్లపై ఎట్టకేలకు స్పందించిన షోయబ్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

