టోక్యో: భారత వెటరన్ టెన్నిస్ ఆటగాడు రోహన్ బోపన్న, జపాన్ సహచరుడు టకెరు యుజుకి ద్వయం జపాన్ ఓపెన్‌లో ఫైనల్స్‌కు దూసుకెళ్లింది.
సోమవారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీస్‌లో ఈ ఇండో జపాన్ జోడీ.. 4-6, 6-3, 18-16తో టాప్ సీడ్ అమెరికా జంట క్రిస్టియన్ హారిసన్-ఎవాన్ కింగ్‌ను ఓడించింది. ఈ సీజన్లో ఒక టోర్నీ ఫైనల్ చేరడం బోపన్నకు ఇదే తొలిసారి.