Venkatesh Iyer | టీమిండియాలో ఒక ఆటగాడితో బౌలింగ్ చేయించకపోవడం మిస్టరీగా ఉందని, దానికి సరైన కారణమేమీ కనిపించడం లేదని సీనియర్ ఆటగాడు రాబిన్ ఊతప్ప విమర్శించాడు. న్యూజిల్యాండ్ సిరీస్‌తో యువ ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్.. భారతజట్టులో అరంగేట్రం చేశాడు.
బ్యాటింగ్‌లో లోయర్ ఆర్డర్లో రావడంతో అతనికి బ్యాటింగ్ చేసే అవకాశం పెద్దగా రాలేదు. జట్టులో హార్దిక్ పాండ్యా లేని లోటును అయ్యర్‌తో పూడుస్తారని అంతా భావించారు. కానీ ఇప్పటి వరకూ ఆడిన రెండు టీ20 మ్యాచుల్లో అతనితో బౌలింగ్ వేయించలేదు. మొదటి మ్యాచ్‌లో ఇలా చేసినప్పుడే చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
అయితే రెండో మ్యాచ్‌లో అతనికి బౌలింగ్ అవకాశం దక్కుతుందని భావించారు. కానీ ఆ మ్యాచ్‌లో కూడా అయ్యర్ చేతికి బంతి వెళ్లలేదు. దీనిపై స్పందించిన ఊతప్ప.. వెంకటేశ్ అయ్యర్‌తో ఎందుకు బౌలింగ్ చేయించడం లేదు? ఆరో బౌలర్‌గా అతన్ని ఎందుకు ఉపయోగించుకోవడం లేదు? అనేది మిస్టరీగా మారిందన్నాడు.
‘తనకు ఆరో బౌలర్ అక్కర్లేదని కెప్టెన్ రోహిత్ అనుకున్నాడేమో? కేవలం బ్యాట్స్‌మెన్‌గానే వెంకటేశ్‌ను ఆడిస్తున్నారేమో?’ అని ఈ వెటరన్ వికెట్ కీపింగ్ బ్యాట్స్‌మెన్ అభిప్రాయపడ్డాడు.