MS Dhoni | టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిపై వెంకటేశ్ అయ్యర్ తాజాగా ప్రశంసలు కురిపించాడు. కెప్టెన్‌గా ధోనీ మాస్టర్ మైండ్‌ను అర్థం చేసుకోవడం ఎవరికీ సాధ్యం కాదని అభిప్రాయపడ్డాడు. ఈ క్రమంలోనే కెప్టెన్ కూల్ ప్లానింగ్‌ను చూసి షాక్‌కు గురైన ఓ సందర్భాన్ని మీడియాతో పంచుకున్నాడు. ఐపీఎల్ సీజన్లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో జరిగిన ఆసక్తికరమైన సంఘటనను గుర్తు చేసుకున్నాడు.
చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా తరఫున నేను, ఇంకో బ్యాటర్ ఇద్దరం క్రీజులో ఉన్నాం. ఆ టైమ్‌లో నేను నాన్‌స్ట్రైకింగ్‌లో ఉన్నా అప్పుడు స్ట్రైకర్ కోసం షార్ట్ థర్డ్ మ్యాన్, కవర్స్ వద్ద ఒక్కొక్కరినీ ఉంచాడు. బౌలర్ బాల్ వేసేందుకు రెడీ అవుతుండగా ధోనీ మళ్లీ ఫీల్డింగ్‌లో మార్పులు చేశాడు. మరో ఫీల్డర్‌ను పిలిచి వేరే ఒక ప్లేస్‌లో ఉంచాడు. అది చూసి ఆశ్చర్యపోయా. అక్కడ ఎవరైనా ఫీల్డర్‌ను పెడతారా అని అనుకున్నా. కానీ తర్వాత వేసిన బంతిలోనే మా బ్యాటర్ ఔటయ్యాడు. ధోనీ ఎక్కడైతే ఫీల్డర్‌ను పెట్టాడో అక్కడికే క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. అలా ఎలా జరిగిందో అర్థం కాలేదన్నారు. ఓ మూడు నాలుగు బంతుల తర్వాత ఔటయి ఉండొచ్చు కదా.. తర్వాత బాల్కే ఎలా జరిగిందో కాక ఆశ్చర్యపోయానని వెంకటేశ్ అయ్యర్ తెలిపాడు. ధోనీ మాస్టర్ మైండ్ పవర్ ఇదేనని తర్వాత అనుకున్నా అంటూ అప్పటి సంఘటనను గుర్తు చేసుకున్నాడు.