పార్ల్: ఇండియాతో జరగనున్న తొలి వన్డేల్లో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకున్నది. భారత జట్టులోకి ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ అరంగేట్రం చేస్తున్నాడు. కేఎల్ రాహుల్ ఇండియా కెప్టెన్సీ బాధ్యతలు చేపడుతున్నాడు. భారత జట్టులో ధావన్, కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, అశ్విన్, శార్దూల్, భువనేశ్వర్, బుమ్రా, చాహల్ ఉన్నారు. ఇక సౌతాఫ్రికా జట్టుకు కీలక బౌలర్ రబడా దూరమైన విషయం తెలిసిందే. ఆ టీమ్‌కు బవుమా కెప్టెన్సీ చేస్తున్నాడు.
#TeamIndia all set and raring to go for the 1st ODI 💪💪#SAvIND pic.twitter.com/rfIMTxVZ2q
— BCCI (@BCCI) January 19, 2022