ఢిల్లీ: రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ(Vaibhav Suryavanshi).. ప్రస్తుతం ఓ సెన్షేషన్. 14 ఏళ్ల ఆ యువ క్రికెటర్ తన ఆటతీరులో అందర్నీ స్టన్ చేశాడు. భారీ షాట్లతో అలరిస్తున్న ఆ కుర్రాడు.. చెన్నైతో మంగళవారం జరిగిన మ్యాచ్‌లోనూ దుమ్మురేపాడు. కేవలం 33 బంతుల్లోనే 57 రన్స్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే మ్యాచ్ ముగిశాక.. క్రికెటర్లు గ్రీటింగ్స్ చెప్పుకుంటున్న సమయంలో.. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ కాళ్లు మొక్కాడు వైభవ్. సీనియర్ల పట్ల ఉన్న తన గౌరవాన్ని చాటుకున్నాడు ఆ కుర్రాడు. వరుసగా ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటున్న సమయంలో.. ఒక చేయితో షేక్ హ్యాండ్ ఇస్తూనే.. మరో చేయితో ధోనీ పాదాన్ని తాకే ప్రయత్నం చేశాడు వైభవ్. ఆ సమయంలో లైట్ స్మైల్ ఇస్తూ వైభవ్‌ను మెచ్చుకున్నాడు ధోనీ. ఈ ఘటన కెమెరాకు చిక్కింది. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతున్నది.
𝙈𝙤𝙢𝙚𝙣𝙩𝙨 𝙩𝙤 𝙘𝙝𝙚𝙧𝙞𝙨𝙝 😊
This is what #TATAIPL is all about 💛🩷#CSKvRR | @ChennaiIPL | @rajasthanroyals pic.twitter.com/hI9oHcHav1
— IndianPremierLeague (@IPL) May 20, 2025
గతంలో కూడా రాజస్థాన్ రాయల్స్‌కు చెందిన యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ ఇదే తరహాలో ధోనీ కాళ్లు మొక్కాడు. ఇప్పుడు వైభవ్ కూడా ఆ సీనియర్ క్రికెటర్ ఆశీస్సులు పొందే ప్రయత్నం చేశాడు. వాస్తవానికి ధోనీ స్వంత పట్టణమైన రాంచీకి సమీపంలోనే బీహార్‌లోని సమస్తిపుర్ ఉన్నది. రెండు రాష్ట్రాలుగా విడిపోవడానికి ముందు ఆ రెండు పట్టణాలు బీహార్లోనే ఉండేవి.
This is the culture of India, Vaibhav Suryavanshi took blessings of MS Dhoni by touching his feet..🙏#CSKvsRR “Vaibhav Suryavanshi” #MumbaiRains Dhoni Kiara Parag Sanctions “Vaibhav Suryavanshi” Ahmedabad Thala pic.twitter.com/oU6yhi8FDl
— Sahil Khanna (@SahilKh83593460) May 20, 2025
ఐపీఎల్లో తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌ను రాజస్థాన్ రాయల్స్ ఘనంగా ముగించింది. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. చెన్నై నిర్దేశించిన 188 పరుగుల లక్ష్యాన్ని రాయల్స్ 17.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. వైభవ్ సూర్యవంశీ (33 బంతుల్లో 57, 4ఫోర్లు, 4సిక్స్‌లు), శాంసన్ (41), జైస్వాల్ (36) దంచేశారు. మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై.. ఆయుష్ మాత్రె (43), డెవాల్డ్ బ్రెవిస్ (42), శివమ్ దూబె (39) రాణించడంతో 20 ఓవర్లలో 187/8 స్కోరు చేసింది. రాజస్థాన్ బౌలర్లలో ఆకాశ్ మధ్వాల్ (3/29), యుధ్వీర్ సింగ్ (3/47) రాణించారు.