బ్రిస్బేన్: ఐపీఎల్లో సంచలన ఆటతో క్రికెట్ ప్రపంచం దృష్టిని ఆకర్షించిన వైభవ్ సూర్యవంశీ.. భారత్ తరఫునా జోరు కొనసాగిస్తున్నాడు. వైభవ్ (68 బంతుల్లో 70, 5 ఫోర్లు, 6 సిక్సర్లు), విహాన్ మల్హోత్ర (70), వికెట్ కీపర్ అభిగ్యాన్ (71) రాణించడంతో ఆస్ట్రేలియాతో జరుగుతున్న అండర్-19 యూత్ వన్డే సిరీస్‌లో భారత్ రెండో వన్డేలో గెలిచి మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 ఆధిక్యం సాధించింది.
బుధవారం జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్ 49.4 ఓవర్లలో 300 రన్స్ చేయగా ఛేదనలో ఆస్ట్రేలియా 249 పరుగులకే పరిమితమైంది. జైడన్ డ్రాపర్ (107) పోరాడాడు. భారత సారథి ఆయుష్ మాత్రె బ్యాట్‌తో విఫలమైనా బంతితో (3/27) రాణించాడు.