Vaibhav Suryavanshi : కొత్త ఛాంపియన్ అవతరించడంతో ఐపీఎల్ 18వ సీజన్ జూన్ 3న ముగిసింది. కానీ, అద్భుత బ్యాటింగ్‌తో అలరించిన కొందరు కుర్రాళ్లు ఆటను మరోసారి చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. అందులో వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) పేరు కచ్చితంగా ఉంటుంది. 35 బంతుల్లోనే శతకంతో.. ఈలీగ్ చరిత్రను తిరగరాసిన ఈ కుర్రాడి విధ్వంసం మాత్రం ఇప్పటికీ అభిమానుల కళ్లముందు మెదులుతోంది.
14 ఏళ్ల వయసులోనే రికార్డు సెంచరీతో అందర్ని ఆశ్చర్యపరిచిన వైభవ్.. ఇకపై టీమిండియా జెర్సీతో చెలరేగనున్నాడు. అండర్ 19 జట్టుకు ఎంపికైన ఈ చిచ్చరపిడుగు వచ్చే ఐపీఎల్ సీజన్లో తన ఆట డబుల్ డోస్‌లో ఉంటుందని తెలిపాడు.
Vaibhav Suryavanshi said “I’ll have to give double the effort now. I’m going to the UK for the first time, it’ll be a new experience. Ayush Mhatre is our captain, he played for CSK this season. We’ll give it everything to bring the trophy home.” pic.twitter.com/HfZJ4RMVZ2
— Sports Culture (@SportsCulture24) June 5, 2025
‘ఐపీఎల్లో ఆడాలనేది ప్రతి క్రికెటర్ కల. తొలి సీజన్ నాకు ఎంతో సానుకూలంగా సాగింది. వచ్చే సీజన్లో జట్టు కోసం నేను ఏం చేయాల్సి ఉంటుందో తెలుసుకున్నాను. ఈసారి నేను చేసిన పొరపాట్లను వచ్చే ఏడాది చేయకుండా జాగ్రత్తపడుతాను. 18 సీజన్లో చెలరేగిన దానికి రెండింతలుగా 19వ ఎడిషన్‌లో నా విధ్వంసం ఉంటుంది. అంతేకాదు మా జట్టు 2026లో ఫైనల్ ఆడాలని నేను బలంగా కోరుకుంటున్నా. కాబట్టి.. అందుకు తగ్గట్టుగా నా బ్యాటింగ్‌కు మరిన్ని మెరుగులు దిద్దుకుంటున్నా’ అని వైభవ్ తెలిపాడు.
పన్నెండు ఏళ్లకే రంజీల్లో అరంగేట్రం చేసిన వైభవ్‌ను మెగా వేలలో రాజస్థాన్ రాయల్స్ సొంతం చేసుకుంది. రూ.1.5 కోట్లకు రాజస్థాన్ శిబిరంలో చేరిన ఈ కుర్రాడు తన బ్యాటింగ్‌ను సానబెట్టుకున్నాడు. కెప్టెన్ సంజూ శాంసన్ గాయపడడంతో లక్నోతో మ్యాచ్‌లో వైభవ్‌కు ఓపెనర్‌గా అవకాశం వచ్చింది. తొలి పోరులోనే 35 పరుగులతో ఆకట్టుకున్న ఈ చిచ్చరపిడుగు.. ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్‌పై సెంచరీతో గర్జించాడు. ఐపీఎల్ హిస్టరీలోనే రెండో వేగవంతమైన శతకం నమోదు చేశాడు. బౌలర్ మారినా బంతి గమ్యం స్టాండ్స్‌లోకే అన్నట్టు చెలరేగిన వైభవ్.. 35 బంతుల్లోనే వందతో జైపూర్ ప్రేక్షకులకు సెల్యూట్ చేశాడు. అతడి విధ్వంసక ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 11 సిక్సర్లు ఉండడం విశేషం.
Youngest to score a T20 1⃣0⃣0⃣ ✅
Fastest TATA IPL hundred by an Indian ✅
Second-fastest hundred in TATA IPL ✅Vaibhav Suryavanshi, TAKE. A. BOW 🙇 ✨
Updates ▶ https://t.co/HvqSuGgTlN#TATAIPL | #RRvGT | @rajasthanroyals pic.twitter.com/sn4HjurqR6
— IndianPremierLeague (@IPL) April 28, 2025
ఐపీఎల్లో వేగవంతమైన సెంచరీ బాదిన వాళ్లలో క్రిస్ గేల్ అగ్రస్థానంలో ఉన్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఆడుతున్న రోజుల్లో గేల్ 30 బంతుల్లోనే శతకగర్జన చేశాడు. 35 బంతుల్లోనే వంద కొట్టేసిన వైభవ్ రెండో స్థానం సొంతం చేసుకున్నాడు. యూసుఫ్ పఠాన్, డేవిడ్ మిల్లర్లు కూడా ఫాస్టెస్ట్ సెంచరీ వీరుల జాబితాలో ఉన్నారు.
1. క్రిస్ గేల్ (ఆర్సీబీ)- 30 బంతుల్లో -2013
2. వైభవ్ సూర్యవంశీ(రాజస్థాన్) – 35 బంతుల్లో – 2025
3. యూసుఫ్ పఠాన్ (రాజస్థాన్) – 37 బంతుల్లో – 2010
4. డేవిడ్ మిల్లర్ (పంజాబ్ కింగ్స్) – 38 బంతుల్లో – 2013