IPL 2025 : భారీ ఛేదనలో రాజస్థాన్ రాయల్స్ కుర్ర ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ(52) దంచేస్తున్నాడు. సిక్సర్లతో విరుచుకుపడుతున్న వైభవ్ 17 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. వాషింగ్టన్ సుందర్ వేసిన 5వ ఓవర్లో ఈ చిచ్చరపిడుగు 6, 6, 4 కొట్టి ఫిఫ్టీకి చేరువయ్యాడు. మరో ఎండ్‌లో యశస్వీ జైస్వాల్(31) సైతం దూకుడుగా ఆడుతున్నాడు. దాంతో, 4 ఓవర్లకే రాజస్థాన్ స్కోర్ 50 దాటింది. ఆ తర్వాత కూడా ఇద్దరూ దంచేయడంతో పవర్ ప్లేలో రాజస్థాన్ వికెట్ కోల్పోకుండా 87 రన్స్ కొట్టింది.
గుజరాత్ నిర్దేశించిన 210 పరుగుల ఛేదనలో రాజస్థాన్ ఓపెనర్లు దూకుడుగా ఆడుతున్నారు. పోటీపోటీగా బౌండరీలతో చెలరేగుతున్నారు. జోస్ బట్లర్ క్యాచ్ వదిలేయడంతో 2 పరుగలు వద్ద యశస్వీ జైస్వాల్(31)కు లైఫ్ లభించింది.
Age: 1⃣4⃣
Power: Unreal 💪Maiden #TATAIPL Fifty for Vaibhav Suryavanshi and also the fastest this season in just 1⃣7⃣ deliveries🫡
Updates ▶ https://t.co/HvqSuGhrbl#RRvGT | @rajasthanroyals pic.twitter.com/2DwXkKc2PR
— IndianPremierLeague (@IPL) April 28, 2025
సిరాజ్ వేసిన మొదటి ఓవర్లో సిక్సర్ బాదిన వైభవ్ సూర్యవంశీ(52) ఆ తర్వాత ఇషాంత్‌కు చుక్కలు చూపించాడు. వరుసగా 6, 6, 4.. ఆ తర్వాత 6, 4 బాదాడు. వాషింగ్టన్ సుందర్ వేసిన 4వ ఓవర్లో 6, 6, 4 కొట్టి ఐపీఎల్లో తొలి అర్థ శతకం సాధించాడీ 14 ఏళ్ల కుర్రాడు.