Vaibhav Suryavanshi : ఐపీఎల్లో రెండో వేగవంతమైన శతకంతో చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) అంతర్జాతీయంగానూ అదరగొడుతున్నాడు. అండర్ -19 విభాగంలో రెచ్చిపోయి ఆడుతున్న ఈ యంగ్‌స్టర్ మరో రికార్డు బద్ధలు కొట్టాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న యూత్ వన్డేలో మెరుపు హాఫ్ సెంచరీ బాదిన వైభవ్.. అత్యధిక సిక్సర్లతో మరో ఫీట్ సాధించాడు. మాజీ టీమిండియా ప్లేయర్ ఉన్ముక్త్ చంద్ (Unmukt Chand) పేరిట ఉన్న రికార్డును తన పేరిట రాసుకున్నాడీ చిచ్చరపిడుగు.
ఆస్ట్రేలియా పర్యటనలో తనదైన స్టయిల్లో విధ్వంస రచన చేస్తున్నాడు 14 ఏళ్ల వైభవ్. ఐపీఎల్ 18వ సీజన్ ఫామ్ కొనసాగిస్తూ .. ఇప్పటికే ఈ సిరీస్‌లో రెండు మ్యాచుల్లో 40 ప్లస్ స్కోర్‌తో మెరిశాడు. ఈసారి అతడు ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ అర్ధ శతకంతో చెలరేగాడు.
Vaibhav Suryavanshi’s first game in Australia was seriously entertaining 👏
Highlights: https://t.co/hfQabdpRwD pic.twitter.com/TdGijK0ZpG
— cricket.com.au (@cricketcomau) September 22, 2025
తుఫాన్ ఇన్నింగ్స్ ఆడిన వైభవ్ 4 ఫోర్లు, 6 సిక్సర్లతో వీరంగం సృష్టించి కంగారూ జట్టుపై మొదటి హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. అంతేకాదు యూత్ వన్డేల్లో 41 సిక్సర్లతో ఉన్ముక్త్ చంద్ నెలకొల్పిన ఆల్‌టైమ్ రికార్డును బ్రేక్ చేశాడు. ఉన్ముక్త్ 21 ఇన్నింగ్స్‌ల్లో 38 సిక్సర్లు బాదితే.. ఈ లెఫ్ట్ హ్యాండర్ మాత్రం కేవలం 10 ఇన్నింగ్స్‌ల్లోనే 41 సిక్సర్లు కొట్టాడు. ఆకాశమే హద్దుగా విరుచుకుపడిన ఈ యంగ్ గన్ 70 రన్స్ కొట్టడంతో ప్రత్యర్థికి భారత్ భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
పన్నెండేళ్లకే రంజీల్లో అరంగేట్రం చేసిన వైభవ్‌ను మెగా వేలలో రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) సొంతం చేసుకుంది. రూ.1.5 కోట్లకు రాజస్థాన్ శిబిరంలో చేరిన ఈ కుర్రాడు తన బ్యాటింగ్‌ను సానబెట్టుకున్నాడు. కెప్టెన్ సంజూ శాంసన్ గాయపడడంతో లక్నోతో మ్యాచ్‌లో వైభవ్‌కు ఓపెనర్‌గా అవకాశం వచ్చింది.
Youngest to score a T20 1⃣0⃣0⃣ ✅
Fastest TATA IPL hundred by an Indian ✅
Second-fastest hundred in TATA IPL ✅Vaibhav Suryavanshi, TAKE. A. BOW 🙇 ✨
Updates ▶ https://t.co/HvqSuGgTlN#TATAIPL | #RRvGT | @rajasthanroyals pic.twitter.com/sn4HjurqR6
— IndianPremierLeague (@IPL) April 28, 2025
తొలి పోరులోనే 35 పరుగులతో ఆకట్టుకున్న ఈ చిచ్చరపిడుగు.. ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్‌పై సెంచరీతో గర్జించాడు. ఐపీఎల్ హిస్టరీలోనే రెండో వేగవంతమైన శతకం నమోదు చేశాడు. బౌలర్ మారినా బంతి గమ్యం స్టాండ్స్‌లోకే అన్నట్టు చెలరేగిన వైభవ్.. 35 బంతుల్లోనే వందతో జైపూర్ ప్రేక్షకులకు సెల్యూట్ చేశాడు. అతడి విధ్వంసక ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 11 సిక్సర్లు ఉండడం విశేషం.