IPL 2025 : ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ(Vaibhav Suryavanshi) చరిత్ర సృష్టించాడు. ఈ 18 ఏళ్లలో ఎవరికీ సాధ్యం కాని ‘ఆల్‌టైమ్ రికార్డు’ నెలకొల్పాడు. రాజస్థాన్ రాయల్స్ తరఫున అరంగేట్రం చేశాడు. తద్వారా ఐపీఎల్ ఆడిన అతిపిన్న వయస్కుడిగా చరిత్రపుటల్లో నిలిచాడీ యంగ్‌స్టర్. లక్నోతో మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చిన వైభవ్ వయసు 14 ఏళ్ల 23రోజులు. దాంతో, ఐదేళ్లుగా ప్రయాస్ రాయ్ బర్మన్(Prayas Ray Barman) పేరిట ఉన్న రికార్డును ఈ కుర్రాడు బద్ధలు కొట్టాడు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున 2019లో బరిలోకి దిగేనాటికి ప్రయాస్ వయసు.. 16 ఏళ్ల 157 రోజులు. ఈ మెగా టోర్నీలో ఆడిన అతి చిన్న వయస్కుల జాబితాలో అఫ్గనిస్థాన్ స్పిన్నర్ ముజీబ్ ఉర్ రెహ్మాన్ మూడో స్థానంలో ఉన్నాడు. 2018లో పంజాబ్ కింగ్స్ ఆటగాడిగా ఐపీఎల్లో 17 ఏళ్ల 11 రోజున అరంగేట్రం చేశాడు ముజీబ్.
Vaibhav Suryavanshi becomes the youngest player in IPL history to debut.
Youngest IPL Debutants
14y 23d – Vaibhav Suryavanshi, 2025* 🇮🇳
16y 157d – Prayas Ray Barman, 2019 🇮🇳
17y 11d – Mujeeb ur Rahman, 2018 🇦🇫
17y 152d – Riyan Parag, 2019 🇮🇳
17y 179d – Pradeep Sangwan, 2008 🇮🇳 pic.twitter.com/FY1Zsou26p— All Cricket Records (@Cric_records45) April 19, 2025
రియాన్ పరాగ్ 17 ఏళ్ల 152 రోజుల వయసులో రాజస్థాన్ ప్లేయర్‌గా 2019లో ఎంట్రీ ఇచ్చాడు. ప్రదీప్ సాంగ్వాన్ 17 ఏళ్ల 179 రోజుల వయసులో ఐపీఎల్లో తొలి మ్యాచ్ ఆడాడు. ఆరంభ సీజన్లో దక్కన్ ఛార్జర్స్ తరఫున బరిలోకి దిగాడీ లెఫ్ట్ ఆర్మ్ పేసర్.
A VIDEO TO REMEMBER IN IPL HISTORY 👑
– ITS VAIBHAV SURYAVANSHI..!!!! pic.twitter.com/ZuKskRWyI7
— Johns. (@CricCrazyJohns) April 19, 2025