ముంబై: టీమిండియా సీనియర్ క్రికెట్ జట్టుకు ఎంపికైన అతి పిన్న వయస్కుడిగా వైభవ్ సూర్యవంశీ(Vaibhav Sooryavanshi) రికార్డు క్రియేట్ చేశాడు. 15 ఏళ్ల 71 రోజులు ఉన్న సూర్యవంశీ .. ఇవాళ జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. గతంలో ఉన్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేశాడు. ఐర్లాండ్, ఇంగ్లండ్‌తో జరగబోయే టీ20 సిరీస్‌లకు వైభవ్ సూర్యవంశీ ని బీసీసీఐ ఎంపిక చేసింది. ఇవాళ ముంబైలో సమావేశమైన సెలెక్షన్ కమిటీ వైభవ్ ట్యాలెంట్‌ను గుర్తించింది. సచిన్ టెండూల్కర్ ఇండియా తరపున 16 ఏళ్ల 205 రోజులు ఉన్నప్పుడు ఎంపికయ్యాడు. 1980 దశకం నుంచి ఆ రికార్డు సచిన్ పేరిటే ఉన్నది. అతి పిన్న వయసులో జాతీయ జట్టు ఆడబోయే రికార్డును ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ సొంతం చేసుకోనున్నాడు.
వైభవ్ తన పవర్ బ్యాటింగ్‌తో తాజా ఐపీఎల్లో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. భారీ సిక్సర్లతో చెలరేగి టోర్నీలోనే అత్యధిక రన్స్ చేశాడు. 776 రన్స్ చేసిన అతను ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నాడు. వైభవ్ పవర్ హిట్టింగ్ చూసి హేమాహేమీ క్రికెటర్లు అందరూ షాక్‌కు గురయ్యారు. అతనిపై ప్రశంసలు కురిపించారు. 2026 ఐపీఎల్లో అతను 237 స్ట్రయిక్ రేట్‌తో 72 సిక్సర్లు బాది గేల్ రికార్డును బ్రేక్ చేశాడు. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఆ యువ క్రికెటర్‌పై విశేషంగా ప్రశంసలు కురిపించారు. ఆ యువ బాలుడి గురించి ఏం చెబుదాం, ప్లేఆఫ్స్‌లో ఎలా ఆ కుర్రాడు ఒంటరిగా రాజస్థాన్ రాయల్స్‌ను ఆదుకునే ప్రయత్నం చేశాడో చూసిందే, ఓ యువకుడి గురించి అంతకన్నా ఎక్కువేం చెప్పలేం, అతని బ్యాటింగ్ ఓ వండర్లా ఉందని, ఈ సీజన్లోనే కాదు, గత సీజన్లోనూ అతను రాణించినట్లు అగార్కర్ తెలిపాడు.
2025 ఐపీఎల్లో సూర్యవంశీ కేవలం 35 బంతుల్లోనే సెంచరీ చేశాడు. ఇక 2026 సీజన్లో అతను మరో సెంచరీ కూడా నమోదు చేశాడు. అయితే ఈసారి రెండు సార్లు అతను 90 స్కోరులో ఔటయ్యాడు. రెండు సెంచరీలు నమోదు చేసుకునే ఛాన్సు మిస్సయ్యాడు.
Presenting #TeamIndia‘s T20I squads for the tours of England & Ireland 2026 🇮🇳#ENGvIND | #IREvIND pic.twitter.com/f84kSSAIDf
— BCCI (@BCCI) June 6, 2026