RR vs SRH | సన్‌రైజర్స్‌ను ముంచిన వైభవ్, ఆర్చర్.. క్వాలిఫయర్ 2లో రాజస్థాన్..!
RR vs SRH : ఓపెనర్ల నుంచి ఆరో బ్యాటర్ వరకూ అందరూ దంచికొట్టగల సమర్ధులే. ఇదివరకే తమ వైల్డ్‌ఫైర్ ఆటతో ఐపీఎల్ రికార్డు స్కోర్‌ను షేక్ చేసిన రికార్డు ఉండనే ఉంది. ఇంకేముంది ఎలిమినేటర్‌లో 244 పరుగుల లక్ష్యాన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ ఉఫ్మనిపిస్తుందనుకుంటే.. అనూహ్యంగా కుప్పకూలింది.
RR vs SRH : ఓపెనర్ల నుంచి ఆరో బ్యాటర్ వరకూ అందరూ దంచికొట్టగల సమర్ధులే. ఇదివరకే తమ వైల్డ్‌ఫైర్ ఆటతో ఐపీఎల్ రికార్డు స్కోర్‌ను షేక్ చేసిన రికార్డు ఉండనే ఉంది. ఇంకేముంది ఎలిమినేటర్‌లో 244 పరుగుల లక్ష్యాన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) ఉఫ్మనిపిస్తుందనుకుంటే.. అనూహ్యంగా కుప్పకూలింది. పదిహేనేళ్ల వైభవ్ సూర్యవంశీ(97) ఊచకోతతో డీలా పడిన హైదరాబాద్‌ను జోఫ్రా ఆర్చర్(58-3) పవర్ ప్లేలోనే పడగొట్టాడు. ఓపెనర్లను ఇషాన్(33) ఔట్ చేసి మ్యాచ్‌ను రాజస్థాన్ వైపు తిప్పాడు. నితీశ్ రెడ్డి(38) కాసేపు నిలబడినా ఆరెంజ్ ఆర్మీ ఘోర ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించింది. అదిరే విక్టరీ కొట్టిన రాజస్థాన్ మే 29న క్వాలిఫయర్ 2లో గుజరాత్ టైటాన్స్‌ను ఢీకొట్టనుంది.
చావోరేవో పోరులో బ్యాటర్లు, బౌలర్ల వైఫల్యంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇంటిదారి పట్టింది. ఎలిమినేటర్‌లో చెత్తాటతో రెండో టైటిల్ వేటను నాకౌట్ దశలోనే ముగించింది. ప్లాన్ ఏ, ప్లాన్ బీ, ప్లాన్ సీ ఉందన్న కమిన్స్ సేనకు వణుకు పుట్టిస్తూ వైభవ్ సూర్యవంశీ(97) సిక్సర్ల మోతతో భారీ స్కోర్ కొట్టిన రాజస్థాన్.. ఆర్చర్(58-3) నిప్పులు చెరగడంతో పవర్ ప్లేలోనే మ్యాచ్‌ను తమ గుప్పిట్లోకి తీసుకుంది. టాపార్డర్ కూలినా.. క్లాసెన్(18) ఉన్నాడులే అనే సన్‌రైజర్స్ ధైర్యాన్ని యశ్ పంజా లాగేసుకున్నాడు. క్లాసెన్‌ను అతడు ఎల్బీగా ఔట్ చేయగా ఓటమి ఖాయమైంది. భారీ విజయంతో క్వాలిఫయర్‌కు 2కు దూసుకెళ్లింది.
Qualifier 2 is officially locked in! 🔒
One final hurdle to the summit clash 🎟️#TATAIPL | #Qualifier2 | #TheFinalLeap | #GTvRR pic.twitter.com/y73BAkfWXC
— IndianPremierLeague (@IPL) May 27, 2026
అభిషేక్ డకౌట్
ప్లే ఆఫ్స్‌లో ఓడితే మరో అవకాశం ఉండదని తెలిసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ పేలవ ప్రదర్శనకు మూల్యం చెల్లించుకుంది. 244 పరుగుల లక్ష్యం పెద్దది కావడంతో దూకుడుగా ఆడి తలొక అర్ధ శతకంతో గెలిపిస్తారనుకుంటే టాపార్డర్ బ్యాటర్లు చేతులెత్తేశారు. అందుకు కారణం ఆదిలోనే సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను జోఫ్రా ఆర్చర్(58-3) గట్టి దెబ్బ కొట్టడమే. ఓపెనర్ అభిషేక్ శర్మ(0)ను రెండో బంతికే డకౌట్ చేసిన అతడు.. సిక్సర్లతో వేగంగా ఆడుతున్న ఇషాన్ కిషన్(33)ను స్లో బంతితో బోల్తా కొట్టించాడు.
బ్యాటింగ్ ఆర్డర్లో ముందొచ్చిన స్మరణ్ రవిచంద్రన్(1) బంతిని అంచనా వేయలేక బర్గర్ ఓవర్లో వెనుదిరిగాడు.
2️⃣ early wickets, 1️⃣ signature celebration 🫶
Updates ▶️ https://t.co/OBIYYIuhbt #TATAIPL | #Eliminator | #TheFinalLeap | #SRHvRR pic.twitter.com/PdzGUqHPz5
— IndianPremierLeague (@IPL) May 27, 2026
టపటపా మూడు వికెట్లు పడిన వేళ.. ట్రావిస్ హెడ్(17), హెన్రిచ్ క్లాసెన్(18)లు ఆచితూచి ఆడబోగా.. హెడ్‌ను బౌల్డ్ చేసిన ఆర్చర్ సన్‌రైజర్స్‌ను ఓటమి వైపు నడిపాడు. కీలక వికెట్లు పడినా క్లానెస్ జతగా తెలుగబ్బాయి నితీశ్ రెడ్డి(38) జట్టును గెలిపించాలనుకున్నాడు. కానీ, యశ్ రాజ్ పంజా వేసిన 7వ ఓవర్లో క్లాసెన్ ఎల్బీగా వెనుదిరిగగా 81 వద్దే సన్‌రైజర్స్ ఐదో వికెట్ పడింది. ఉన్నంతసేపు చూడచక్కని షాట్లు ఆడిన నితీశ్‌ను జడ్డూ.. కమిన్స్(1)ను సుశాంత్ ఔట్ చేయడంతో ఇంప్యాక్ట్ సబ్ సలీల్ అరోరా(35) కాసేపు పోరాడాడు. 47పరుగుల తేడాతో గెలుపొందిన పరాగ్ సేన మే 29న ఇదే మైదానంలో గుజరాత్‌తో అమీతుమీ తేల్చుకోనుంది.
వైభవ్ పిడుగల్లే
ఐపీఎల్ సంచలనం వైభవ్ సూర్యవంశీ(97) రికార్డులను బద్ధలు కొడుతూ ఆడిన తుఫాన్ ఇన్నింగ్స్‌తో ఎలిమినేటర్‌లో రాజస్థాన్ రాయల్స్ కొండంత స్కోర్ చేసింది. ముల్లన్‌పూర్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పేస్ దళాన్ని వణికిస్తూ 16 బంతుల్లోనే అర్ధ శతకం బాదిన వైభవ్.. తృటిలో రికార్డు శతకాన్ని చేజార్చుకున్నాడు.

అనంతరం ధ్రువ్ జురెల్(50) హాఫ్ సెంచరీతో రాణించగా 250 ప్లస్ కొట్టేలా కనిపించింది రాజస్థాన్. కానీ, డెత్ ఓవర్లలో 36 పరుగులే ఇచ్చిన హైదరాబాద్ ప్రత్యర్థిని 243కు కట్టడి చేసింది. మెరుపు అర్ధ శతకం బాదిన వైభవ్ ఒకే సీజన్లో క్రిస్ గేల్ పేరిట ఉన్న 59 అత్యధిక సిక్సర్ల రికార్డును అధిగమించాడు. ప్రస్తుతం అతడి ఖాతాలో 65 సిక్సర్లున్నాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

