INDA vs SLA : ముక్కోణపు వన్డే సిరీస్ ఫైనల్లో భారత ఏ జట్టు కొండంత స్కోర్ కొట్టింది. శ్రీలంక బౌలర్లను భయపెడుతూ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ(94) మెరుపు అర్ధ శతకంతో విజృంభించగా.. కెప్టెన్ తిలక్ వర్మ(67) దంచేశాడు. పవర్ ప్లేలోనే వైభవ్ ఊచకోత చూసతే.. అలవోకగా టీమిండియా నాలుగొందలు కొడుతుందనిపించింది. కానీ, మిడిలార్డర్ వైఫల్యం, డెత్ ఓవర్లలో భారత ఆటగాళ్లను లంక పేసర్లు గొప్పగా కట్టడి చేశారు. దాంతో, ప్రత్యర్థికి 378 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఐపీఎల్ 19వ సీజన్లో ఆకాశమే హద్దుగా చెలరేగిన వైభవ్ సూర్యవంశీ(94) ముక్కోణపు వన్డే సిరీస్ ఫైనల్లో శివమెత్తాడు. శ్రీలంక ఏ బౌలర్లకు మూడు చెరువుల నీళ్లు తాగించిన వైభవ్.. దొరికిన బంతిని దొరికినట్టు బౌండరీకి, స్టాండ్స్‌లోకి పంపాడు. అతడి విధ్వంసంతో స్కోర్ రాకెట్ వేగంతో పరుగెత్తింది. గత మ్యాచ్ గొడవను మనసులో పెట్టుకున్నాడేమో లంక బౌలర్లను ఉతికారేసిన ఈ చిచ్చరపిడుగు.. కేవలం 11 బంతుల్లోనే అర్ధ శతకంతో చెలరేగాడు.
A partnership of 1️⃣3️⃣2️⃣(53) 🔥
1️⃣5️⃣ Fours and 9️⃣ Sixes 🤯Pure brilliance from Vaibhav Sooryavanshi and Priyansh Arya in the Final 💪
Updates ▶️ https://t.co/CnmyVyoyjy#SLAvINDA | #TriNationSeries pic.twitter.com/147xU96V5Z
— BCCI (@BCCI) June 21, 2026
ఆపైనా.. అదే ఊపును కొనసాగిస్తూ ప్రియాన్ ఆర్య(39)తో కలిసి స్కోర్ బోర్డును ఉరికించాడు. 29 బంతుల్లోనే సెంచరీ కొట్టేస్తాడనుకున్న వైభవ్ పెద్ద షాట్‌కు యత్నించి ఔటయ్యాడు. ఆ తర్వాత.. తిలక్ వర్మ(67), రుతురాజ్ గైక్వాడ్(40)లు దంచేశారు. కానీ, మిడిల్ ఓవర్లలో లంక బౌలర్లు వరసగా వికెట్లు తీసి స్కోర్ వేగానికి బ్రేకులు వేశారు. కుమార్ కుషగ్ర(39), ఆఖర్లో అనుకుల్ రాయ్(39) మెరుపులతో భారత ఏ జట్టు 9 వికెట్ల నష్టానికి 377 పరుగులతో లంకకు సవాల్ విసిరింది.