డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ వేదికగా 38వ నేషనల్ గేమ్స్‌కు మంగళవారం అట్టహాసంగా తెరలేచింది స్థానిక రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా ఆరంభ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రధాని నరేంద్రమోదీ నేషనల్ గేమ్స్ ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
తెలంగాణ నుంచి 212 మంది ప్లేయర్లు 23 క్రీడావిభాగాల్లో పోటీపడుతున్నారు. ధనుశ్ శ్రీకాంత్, చికిత తెలంగాణ ఫ్లాగ్ బేరర్స్‌గా వ్యవహరించారు.