డెహ్రాడూన్: హైదరాబాద్, ఉత్తరాఖండ్ మధ్య రంజీ గ్రూపు-బీ మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతున్నది. శుక్రవారం తొలుత టాస్ గెలిచిన హైదరాబాద్..బౌలింగ్ ఎంచుకుంది. అవ్నిశ్(89), ఆదిత్య తారె(69) అర్ధసెంచరీలతో ఉత్తరాఖండ్ తొలి ఇన్నింగ్స్లో 313/8 పరుగులు చేసింది.
హైదరాబాద్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ఉత్తరాఖండ్ బ్యాటర్లు పరుగులు కొల్లగొట్టారు. ముఖ్యంగా అవ్నిశ్ జట్టుకు మెరుగైన శుభారంభాన్ని అందించాడు. తనయ్ త్యాగరాజన్(3/83) మూడు వికెట్లతో ఆకట్టుకోగా, రోహిత్రాయుడు(2/16) రెండు వికెట్లు తీశాడు.