చెన్నై: అల్టిమేట్ టేబుల్ టెన్నిస్(యూటీటీ) లీగ్‌కు వేళయైంది. చెన్నై.. జవహర్లాల్ నెహ్రూ స్టేడియం వేదికగా ఆగస్టు 22 నుంచి సెప్టెంబర్ 7వ తేదీ వరకు యూటీటీ టోర్నీ జరుగనుంది. మొత్తం ఎనిమిది జట్లు 23 మ్యాచ్‌ల్లో తలపడనున్నాయి. డిఫెండింగ్ చాంపియన్ గోవా చాలెంజర్స్ తమ తొలి మ్యాచ్‌లో జైపూర్ ప్యాట్రియాట్స్ను ఎదుర్కొనుంది. లీగ్‌లో స్టార్ ప్యాడర్లు శరత్‌కమల్, మనికా బత్రా, ఆకుల శ్రీజతో పాటు బెర్నాండెటె, నినా మిత్లెహామ్, ఖాద్రి అరున లాంటి విదేశీ స్టార్లు పోటీపడబోతున్నారు. ఎనిమిది జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. ఒక్కో పోరులో ఐదు మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఇందులో పురుషుల, మహిళల సింగిల్స్ రెండేసి మ్యాచ్‌లు, ఒక మిక్స్డ్ డబుల్స్ మ్యాచ్‌లు జరుగనున్నాయి.