Robin Uthappa : సుదీర్ఘ ఫార్మాట్‌కు సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లీ (Virat Kohli) వీడ్కోలు పలకడంపై ఇప్పటికీ సందేహాలు వ్యక్తమవుతున్నాయి. స్వదేశంలో జూనియర్లు విఫలమవుతున్న వేళ రో-కో రిటైర్మెంట్ను వెనక్కి తీసుకోవాలనే డిమాండ్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప (Robin Uthappa) సంచలన వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ, రోహిత్ వీడ్కోలుపై తనకు సందేహాలున్నాయని ఊతప్ప అన్నాడు.
ఈ ఏడాది ఇంగ్లండ్ పర్యటనకు ముందు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు టెస్టులకు అల్విదా చెప్పారు. ముందుగా హిట్‌మ్యాన్.. ఆ తర్వాత వారం రోజుల్లోనే విరాట్ సైతం ‘నేనూ వైదొలుగుతున్నా’ అని ప్రకటించాడు. దాంతో.. మరో రెండేళ్లు ఆడగల సామర్థ్యమున్న ఈ ఇద్దరూ ఒకరివెంట ఒకరు వీడ్కోలు పలకడం అందర్నీ షాక్‌కు గురి చేసింది. ఇదేంటీ.. ఉన్నట్టుండి రో-కో రిటైర్మెంట్ చెప్పేయడం ఏంటీ? అని అందరూ చర్చించుకున్నారు. మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప సైతం వీరిద్దరి వీడ్కోలును నమ్మలేకపోతున్నాడట. మంగళవారం తన సొంత యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడుతూ ”నాకెందుకో కోహ్లీ, రోహిత్ టెస్టు రిటైర్మెంట్ సహజంగా అనిపించడం లేదు. ఎవరైనా వారిని వీడ్కోలు చెప్పాలని బలవంతం చేశారా? అనేది తెలియదు.
Robin Uthappa feels the Test retirements of Indian legends Rohit Sharma and Virat Kohli don’t appear to be natural decisions. 👀🗣️#TestCricket #ViratKohli #RohitSharma #Sportskeeda pic.twitter.com/ZyTyiqNI0h
— Sportskeeda (@Sportskeeda) December 30, 2025
కానీ.. ఏదో రోజు నిజం బయటకు రాకపోదు. కోహ్లీ, రోహిత్ స్వయంగా తాము ఎందుకు టెస్టులకు హఠాత్తుగా వీడ్కోలు పలికామో చెబుతారని అనుకుంటున్నా. ఆస్ట్రేలియా పర్యటనలో రోహిత్ పరుగులు చేయలేదు. సో.. అతడు ఓ ఆరు నెలలు బ్రేక్ తీసుకొని ఫిట్నెస్ మీద దృష్టి పెడుతాడని భావించాను. ఎందుకంటే హిట్‌మ్యాన్ మళ్లీ రన్స్ కొడుతాడనే విషయంలో నాకెలాంటి సందేహం లేదు. అలాంటిది వీరిద్దరూ స్వల్ప వ్యవధిలోనే టెస్టులకు గుడ్ బై చెప్పారు. వీరిద్దరూ ఈ సంచలన నిర్ణయం ఎందుకు తీసుకున్నారో త్వరలోనే అందరికీ తెలుస్తుంది” అని ఊతప్ప అన్నాడు.
Robin Uthappa felt that Rohit Sharma and Virat Kohli’s Test retirements didn’t seem natural. pic.twitter.com/en4ONnQ6j8
— Circle of Cricket (@circleofcricket) December 30, 2025
ఆస్ట్రేలియా పర్యటనలో విఫలమైన రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పిస్తారనే వార్తలు వచ్చాయి. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్(WTC) 2025-27 సీజన్ కోసం కొత్త సారథిని నియమించేందుకు బీసీసీఐ సెలెక్టర్లు సిద్దమవ్వడం, ఫామ్ లేమి హిట్‌మ్యాన్‌ను వీడ్కోలుకు పురిగొల్పి ఉంటాయని టాక్. ‘మరి.. టెస్టులను ప్రాణంగా ప్రేమించే కోహ్లీ ఎందుకు రిటైరయ్యాడు?’ అనేది ఇప్పటికీ మిలియన్ డాలర్ల ప్రశ్న. మరోసారి కెప్టెన్సీ ఆశించిన విరాట్‌కు సెలెక్టర్లు కుదరని చెప్పారని.. అందుకే అతడు టెస్టులకు బైబై చెప్పాడని అంటారు. కానీ.. అసలు వీరిద్దరు సైలెంట్‌గా వైదొలగడానికి అసలు కారణమేంటో తెలిసే రోజు కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం వన్డేల్లోనే కొనసాగుతున్న రో-కో వచ్చే ఏడాది ప్రపంచకప్‌లో ఆడుతారా? లేదా? అనేది కూడా తెలియాల్సి ఉంది.