న్యూయార్క్: టీ20 వరల్డ్‌కప్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లోనే అమెరికా చేతిలో ఓటమితో అభిమానుల ఆగ్రహాన్ని చవిచూస్తున్న పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు మరో తలనొప్పి తప్పేట్టు లేదు. గురువారం నాటి మ్యాచ్‌లో ఆ జట్టు స్టార్ పేసర్ హరీస్ రవూఫ్ బాల్ టాంపరింగ్‌కు పాల్పడ్డాడడని యూఎస్ఏ సీనియర్ క్రికెటర్ రస్టీ థెరాన్ ఆరోపించడం చర్చనీయాం శమైంది.
పాక్-యూఎస్ఏ మ్యాచ్ ముగిశాక అతడు ఎక్స్(ట్విటర్) వేదికగా స్పందిస్తూ.. ‘2 ఓవర్లకు ముందే మార్చిన కొత్త బంతితో రివర్స్ స్వింగ్‌ను రాబట్టగలరా? రవూఫ్ తన బొటనవేలితో బంతిపై రుద్దుతూ పరుగెత్తడాన్ని స్పష్టంగా చూడొచ్చు’ అంటూ ఐసీసీని ట్యాగ్ చేశాడు. దీనిపై తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని ఐసీసీని కోరాడు.