దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న యూనైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (యూఎస్ఏ) క్రికెట్ బోర్డుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) షాకిచ్చింది.
ఐసీసీ నిబంధనలను అమలుచేయడంలో విఫలమవుతుందని ఆరోపిస్తూ యూఎస్ క్రికెట్ బోర్డు సభ్యత్వాన్ని సస్పెండ్ చేసింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపింది.