USA vs IRE : టీ20 వరల్డ్ కప్‌లో అమెరికా (USA), ఐర్లాండ్(Ireland) జట్ల ఆఖరి లీగ్ మ్యాచ్ రద్దు అయ్యేలా ఉంది. ఫ్లోరిడాలో ఔట్ ఫీల్డ్(Out Field) ఇంకా తడిగా ఉండడడమే అందుకు కారణం. దాంతో టాస్ మరింత ఆలస్యం కానుంది. రాత్రి 10: 45కు మరోసారి అంపైర్లు ఔట్ ఫీల్డ్‌ను పరిశీలించనున్నారు.
ఒకవేళ ఆ సమయానికి తడి తగ్గితే కనీసం ఐదు ఓవర్ల మ్యాచ్ ఆడిస్తారు. కానీ, పచ్చిగా ఉంటే మాత్రం మ్యాచ్‌ను రద్దు చేసి ఇరుజట్లకు చెరొక పాయింట్ కేటాయించే చాన్స్ ఉంది. అదే జరిగితే అమెరికా 5 పాయింట్లతో సూపర్ 8కు దూసుకెళ్తుంది. మరో మ్యాచ్ ఉన్నా సరే ఐర్లాండ్, పాకిస్థాన్‌లు ఎలిమినేట్ అవుతాయి.
Lauderhill, Florida 📍
The toss between USA and Ireland has been delayed due to a wet outfield.#T20WorldCup | #USAvIRE | 📝: https://t.co/WpJ6oVQFeu pic.twitter.com/urByXDc0TF
— ICC (@ICC) June 14, 2024
ఫ్లోరిడాలో టాస్ సమయం 7:30 గంటలకు ముందే వాన మొదలైంది. దాంతో ఔట్ ఫీల్డ్ మొత్తం చిత్తడిగా మారింది. అందువల్ల అంపైర్లు టాస్‌ను వాయిదా వేశారు. గ్రౌండ్ సిబ్బంది సూపర్ సాపర్స్ను ఉపయోగించి నీటిని పిండేశారు. అనంతరం 9 గంటలకు, 9:45కి అంపైర్లు ఔట్ ఫీల్డ్‌ను పరిశీలించారు. అయినా పలుచోట్ల ఇంకా తడిగానే ఉండడంతో మళ్లీ 10:45కు వచ్చి చెక్ చేయనున్నారు. అప్పటికీ పరిస్థితి మెరుగైతే 5 ఓవర్లు ఆడిస్తారు. లేదంటే అమెరికా, ఐర్లాండ్‌కు తలొక పాయింట్ కేటాయిస్తారు.