Meera Rautela : కారు యాక్సిడెంట్లో గాయపడిన వికెట్ కీపర్ రిషభ్ పంత్ తొందరగా కోలుకోవాలని అంతా కోరుకుంటున్నారు. తాజాగా బాలీవుడ్ నటి ఊర్వశి రౌతెలా తల్లి మీరా రౌతెలా కూడా అతను తొందరగా కోలుకొని, జట్టుతో ఆడాలని ప్రార్ధించింది. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పంత్ ఫోటో షేర్ చేసి ఆసక్తికర క్యాప్షన్ రాసింది. ‘సోషల్‌మీడియాలో విమర్శలు ఒకవైపు.. నువ్వు తొందరగా కోలుకోవడం, మళ్లీ అంతర్జాతీయ క్రికెట్ ఆడడం, ఉత్తరాఖండ్ పేరు ప్రతిష్టలను విశ్యవ్యాప్తం చేయడం మరోవైపు. అందరూ పంత్ గురించి ప్రార్ధించండి’ అంటూ మీరా ఆసక్తికర పోస్ట్ పెట్టింది. ఆమె పోస్ట్ చూసిన ఫ్యాన్స్ కొందరు ఊర్వశిని ట్యాగ్ చేస్తూ.. నువ్వు కూడా పోస్ట్ పెట్టు అని కామెంట్ చేస్తున్నారు. పంత్ యాక్సిడెంట్‌కు గురైన రోజు నుంచి ఇప్పటి వరకు ఊర్వశి అతని గురించి ఎలాంటి కామెంట్, పోస్ట్ పెట్టలేదు.
ఊర్వశి రౌతెలా, రిషభ్ పంత్ వెంట పడుతుందంటూ సోషల్‌మీడియాలో విమర్శలు వెల్లువెత్తడం తెలిసిందే. 2018లో ఆర్పీ అనేటాయన తన కోసం హోటల్ లాబీలో గంటల కొద్దీ ఎదరుచూశాడని ఊర్వశి చెప్పింది. అయితే.. రిషభ్ పంత్ ఆమె వ్యాఖ్యలను ఖండించాడు. అప్పటినుంచి ప్రతిసారి ఈ బాలీవుట్ నటి వార్తల్లో నిలుస్తోంది. ఆమె ఈసారి వెండితెరమీద తెలుగు అభిమానులను అలరించనుంది. సంక్రాతికి విడుదల కానున్న వాల్తేరు వీరయ్యలో స్పెషల్ సాంగ్ చేసింది. బాస్ పార్టీ సాంగ్‌లో చిరుతో ఊర్వశి ఆడిపాడింది. డిసెంబర్ 30వ తేదీన ఉదయం 5గంటలకు పంత్ డ్రైవ్ చేస్తున్న కారు యాక్సిడెంట్‌కు గురైంది. అతన ప్రస్తుతం డెహ్రడూన్‌లోని మ్యాక్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.