MI vs UPW : మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) పదో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ (Mumbai Indians), యూపీ వారియర్స్ (UP Warriorz) జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన యూపీ కెప్టెన్ అలీసా హేలీ (Alyssa Healy) బ్యాటింగ్ తీసుకుంది. ఈ లీగ్‌లో హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతున్న ముంబై జట్టును యూపీ వారియర్స్ నిలువరించనుందా? లేదా? అనేది ఆసక్తికరం. ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో గెలుపు ఎవరిదో..? అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ముంబై ఇండియన్స్ జట్టు : హేలీ మాథ్యూస్, యస్తికా భాటియా(వికెట్ కీపర్), నాట్ సీవర్ బ్రంట్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), ధారా గుజ్జర్, అమేలియా కేర్, ఇసీ వాంగ్, అమన్‌జోత్ కౌర్, హుమారియా కాజీ, జింతిమణి కలిత, సాయిక్ ఇషాక్,
యూపీ వారియర్స్ జట్టు : అలిసా హేలీ(కెప్టెన్, వికెట్ కీపర్), దేవికా వైద్యా, శ్వేతా షెరావత్, కిరణ్ నవ్‌గిరే, తహ్లియా మెక్‌గ్రాత్, దీప్తీ శర్మ, సిమ్రాన్ షస్త్రక్, , సోఫీ ఎక్లెస్టోన్, షబ్నిం ఇస్మాయిల్, అంజలీ సర్వానీ, రాజేశ్వరీ గైక్వాడ్.
ముంబై జట్టులో ఓపెనర్ హేలీ మాథ్యూస్, నాట్ సీవర్ బ్రంట్, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ సూపర్ ఫామ్‌లో ఉన్నారు. బౌలింగ్‌లోనూ ఆ జట్టు ఇసీ వాంగ్, మాథ్యూస్‌తో బలంగా ఉంది. గత మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై యూపీ 10 వికెట్ల తేడాతో గెలిచింది. ఓపెనర్లు హేలీ, దేవికా వైద్య దంచి కొట్టారు. యూపీకి కిరణ్ నవ్గరే, తహ్లియా మెక్‌గ్రాత్ వంటి హిట్టర్లు ఉన్నారు. ఈ మ్యాచ్‌లో వీళ్లు ఎలా రాణిస్తారో చూడాలి.