Yash Dayal : మైనర్ బాలికపై అత్యాచారం కేసును ఎదుర్కొంటున్న యశ్ దయాల్ (Yash Dayal)కు మరో షాక్ తగిలింది. హైకోర్టు ఆదేశాల మేరకు అరెస్టు నుంచి ఊరట పొందిన అతడికి ఉత్తరప్రదేశ్ క్రికెట్ సంఘం (UP Cricket Association) ఝలక్ ఇస్తూ.. నిషేధం విధించింది. మరో వారంలో ప్రారంభం కానున్న యూపీ టీ20 లీగ్(UP T20 League)లో ఆడకుండా అతడిని సస్పెండ్ చేసింది. దాంతో.. పోక్సో కేసు తేలేంతవరకూ దయాల్ క్రికెట్ మ్యాచ్‌లు ఆడడం అసాధ్యమేనని అనిపిప్తోంది.
ఐపీఎల్ హీరో అయిన దయాల్‌ను యూపీ టీ20 లీగ్ కోసం గోరఖ్‌పూర్ లయన్స్ (Gorakhpur Lions) జట్టు రూ.7 లక్షలకు కొన్నది. ఆర్సీబీని గెలిపించిన దయాల్ తమ జట్టుకు ప్రధాన అస్త్రం అవుతాడని యాజమాన్యం భావించింది. కానీ, మైనర్ బాలికను నమ్మించి మోసం చేసినందుకు ఈ పేసర్‌పై ఈమధ్యే పోలీస్ కేసు నమోదయింది. దాంతో యూపీ క్రికెట్ సంఘం దయాల్‌పై నిషేధం విధించింది. యూపీ టీ20 లీగ్ ఆగస్టు 17 నుంచి ప్రారంభం కానుంది. ఆగస్టు 18న కాశీ రుద్రాస్ టీమ్‌తో గోరఖ్‌పూర్ లయన్స్ తలపడనుంది.
🚨 No Yash Dayal in UP T20 🚨
Yash Dayal has been banned from the UP T20 after a police case was registered against him.
He was purchased by the Gorakhpur Lions for ₹7 lakh. [Dainik Jagran]
📷 BCCI pic.twitter.com/196449lQYi
— CricketGully (@thecricketgully) August 11, 2025
పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. మోసం చేశాడని ఘాజియాబాద్‌కు చెందిన మహిళ ఇచ్చిన ఫిర్యాదులో పోలీసులు అతడిపై భారత న్యాయ సంహితలోని సెక్షన్ 69 కింద కేసు రిజిస్టర్ చేశారు. ఆరోపణలు రుజువైతే స్పీడ్‌స్టర్‌కు 10 ఏళ్ల జైలు శిక్ష పడడం ఖాయమని చెబుతున్నారు పోలీసులు. దయాల్‌పై లైంగిక వేధింపుల కేసు పెట్టిన ఆమె సంచలన విషయాల్ని తన ఫిర్యాదులో పేర్కొంది. ‘దయాల్, నేను ఐదేళ్లు రిలేషన్షిప్లో ఉన్నాం. అతడు నన్ను వాళ్ల కుటుంబానికి పరిచయం చేశాడు. దాంతో, నన్ను పెళ్లి చేసుకుంటాడని నమ్మాను. కానీ, అతడు నమ్మించి మోసం చేశాడు.
🚨 RCB Pacer Yash Dayal barred From Playing in UP T20 League.
Yash Dayal was set to represent the Gorakhpur Lions in the upcoming UP T20 League. pic.twitter.com/E6hkTfqhEC— RCBIANS OFFICIAL (@RcbianOfficial) August 11, 2025
అంతేకాదు మానసికంగా, శారీరకంగా, ఆర్ధికంగా నన్ను ఎంతో ఇబ్బందులకు గురి చేశాడు. అతడి దురుద్దేశాన్ని అర్ధం చేసుకున్న నేను ప్రశ్నించాను. అప్పటినుంచి నన్ను హింసించడం మొదలుపెట్టాడు’ అని ఆమె తన కంప్లైంట్లో వెల్లడించింది. దయాల్ తనను వేధించాడనడానికి సాక్ష్యంగా తమ ఇద్దరి మధ్య జరిగిన చాట్ రికార్డ్స్, స్క్రీన్‌షాట్స్, వీడియో కాల్ రికార్డింగ్‌లు, ఇద్దరు సన్నిహితంగా దిగిన ఫొటోలను ఆమె పోలీసులకు సమర్పించింది. అయితే.. ఈ వ్యవహారంపై దయాల్ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాడు. దాంతో, సదరు న్యాయస్థానం దయల్ను అరెస్ట్ చేయకూడదంటూ స్టే విధించిన విషయం తెలిసిందే.
ఐపీఎల్లో రింకూ సింగ్ ఊచకోతకు బలైన బౌలర్‌గా దయాల్ పేరు మార్మోగిపోయింది. కోల్‌కతా నైట్ రైడర్స్ హిట్టర్ రింకూ సింగ్(Rinku Singh) ధాటికి ఐదు సిక్సర్లు సమర్పించుకుని విమర్శలపాలైన అతడు.. 18వ సీజన్లో ఆర్సీబీ తరఫున రఫ్ఫాడించాడు. 13 వికెట్లతో ఆ జట్టు తొలి ట్రోఫీ కల సాకారం అవ్వడంలో కీలక పాత్ర పోషించాడీ పేసర్.