న్యూఢిల్లీ: అండర్-19 ప్రపంచకప్ చేజిక్కించుకున్న యువ భారత జట్టు మంగళవారం స్వదేశానికి చేరుకుంది. సుదీర్ఘ ప్రయాణానంతరం నేరుగా బెంగళూరు విమానాశ్రయంలో అడుగుపెట్టగా.. యువ ఆటగాళ్లకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. స్వదేశం చేరుకున్న యువ భారత జట్టును బుధవారం బీసీసీఐ అహ్మదాబాద్లో సన్మాన కార్యక్రమం నిర్వహించనుంది.