హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) ఆధ్వర్యంలో జరుగుతున్న బాలుర అండర్-14 పోరులో ప్రాబబుల్స్ ‘సీ’ టీమ్ 5 వికెట్ల తేడాతో ప్రాబబుల్స్ ‘ఈ’పై ఘన విజయం సాధించింది. తొలుత ప్రాబబుల్స్ ‘ఈ’ టీమ్ 57 ఓవర్లలో 168 పరుగులకే పరిమితమైంది. దివేశ్ రఘునందన్(40) టాప్‌స్కోరర్‌గా నిలువగా, మనీశ్పటేల్ (3/24), క్రిష్ (2/31) రాణించారు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ప్రాబబుల్స్ ‘సీ’70.3 ఓవర్లలో 239 పరుగులు చేసింది.
ఓపెనర్ అందె శ్రేయాస్ (193 బంతుల్లో 125, 18ఫోర్లు, 2సిక్స్‌లు) సూపర్ సెంచరీతో విజృంభించాడు. ప్రత్యర్థి బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ శ్రేయాస్ సాధికారిక ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. సహచర బ్యాటర్లు విఫలమైన తన విలువ చాటుకుంటూ శ్రేయాస్ తన ఇన్నింగ్స్‌లో 18 ఫోర్లు, రెండు భారీ సిక్స్‌లతో చెలరేగాడు. హర్షిత్ (3/28), విరాట్ కశ్యప్ (3/59) మూడేసి వికెట్లు తీశారు.