Ashes Series : యాషెస్ సిరీస్‌ను గెలుపొందిన ఆస్ట్రేలియా (Australia) నామమాత్రమైన ఐదో మ్యాచ్‌లో విజయంపై కన్నేసింది. మెల్బోర్న్లో ఇంగ్లండ్ షాకివ్వడంతో క్లీన్‌స్వీప్ అవకాశాన్ని చేజార్చుకున్న ఆతిథ్య జట్టు 4-1తో సిరీస్‌ను ముగించాలనుకుంటోంది. సిడ్నీ టెస్టు (Sydney Test)లో ఇంగ్లండ్‌ను దెబ్బకొట్టాలనే ఉద్దేశంతో కొత్త ఏడాది మొదటి రోజే కంగారూ ఆటగాళ్లు నెట్స్‌లో చెమటోడ్చారు. ఆనవాయితీకి విరుద్ధంగా ఈసారి మ్యాచ్‌కు మూడు రోజుల ముందే క్రికెట్ ఆస్ట్రేలియా తమ స్క్వాడ్‌ను ప్రకటించింది. అయితే.. స్టీవ్ స్మిత్ సారథిగా 15 మందితో కూడిన బృందంలో ఏ మార్పులు చేయలేదని ఆ దేశ బోర్డు వెల్లడించింది.
స్వదేశంలో జరుగుతున్న యాషెస్ సిరీస్‌లో హ్యాట్రిక్ విజయాల తర్వాత తొలి ఓటమి ఎదురైంది ఆస్ట్రేలియాకు. పెర్త్, బ్రిస్బేన్, అడిలైడ్‌లో ఇంగ్లండ్‌ను చిత్తుగా ఓడించిన ఆసీస్.. మెల్బోర్న్లో మాత్రం తడబడింది. క్రిస్మస్ తెల్లారి జరిగిన బాక్సింగ్ డే టెస్టులో జోష్ టంగ్ విజృంభణతో కంగారూ బ్యాటర్లు తోకముడించారు. దాంతో… 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైన స్టీవ్ స్మిత్ బృందం సిడ్నీలో పంజా విసరాలనుకుంటోంది. సిరీస్‌లో ఆఖరిదైన ఈ టెస్టులో చెలరేగి 4-1తో ట్రోఫీ అందుకోవాలని ఆతిథ్య జట్టు భావిస్తోంది.
Australia has released its squad for Sydney, but do they need to make any moves for the next #Ashes Test?
More: https://t.co/5RRzXKNq8Q pic.twitter.com/39cpBpknbn
— cricket.com.au (@cricketcomau) January 1, 2026
ఓపెనర్ నుంచి మిడిలార్డర్‌కు పడిపోయిన ఉస్మాన్ ఖవాజా సిడ్నీ టెస్టు తర్వాత వీడ్కోలు పలుకుతాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇంగ్లండ్ విషయానికొస్తే.. .. 14 ఏళ్ల తర్వాత మెల్బోర్న్లో విజయంతో సిరీస్‌లో బోణీ చేసింది. కుర్రాళ్లు జాకబ్ బెథెల్, బ్రైడన్ కార్సే, జోష్ టంగ్ రాణించడంతో ఆస్ట్రేలియాకు చెక్ పెట్టిన ఇంగ్లండ్ .. సిడ్నీలోనూ గెలుపుపై ధీమాగా ఉంది. జనవరి 4న సిడ్నీ మైదానంలో ఇరుజట్ల మధ్య చివరి టెస్టు జరుగనుంది.
ఆస్ట్రేలియా స్క్వాడ్ : స్టీవ్ స్మిత్(కెప్టె్న్), ట్రావిస్ హెడ్, బ్యూ వెబ్‌స్టర్, మార్నస్ లబూషేన్, అలెక్స్ క్యారీ(వికెట్ కీపర్), బ్రెండన్ డగెట్, కామెరూన్ గ్రీన్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, టాడ్ మర్ఫీ, మైఖేల్ నెసెర్, జై రిచర్డ్సన్, మిచెల్ స్టార్క్, స్కాట్ బొలాండ్.