UTT | చెన్నై: అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ (యూటీటీ)-2024లో ఆతిథ్య చెన్నై లయన్స్ బోణీ కొట్టింది. ఆదివారం ఇక్కడి జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో 8-7తో దబాంగ్ ఢిల్లీని ఓడించింది. ఢిల్లీకి ఇది వరుసగా రెండో పరాభవం.
పురుషుల సింగిల్స్‌లో చెన్నై లయన్స్ ప్యాడ్లర్ ఆచంట శరత్ కమాల్ 2-1తో ఆండ్రీస్ లెవంకొను ఓడించి తన జట్టుకు తొలి విజయాన్ని అందించాడు. ఆ తర్వాత సకురా మొరి, జుసెల్ రొలండ్ మిక్స్డ్ డబుల్స్‌లో శరత్, సకురా విజయాలు సాధించా రు. బైస్య 0-3తో దియా చిటాలె చేతిలో ఓడిపోయింది.