అహ్మదాబాద్ : అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ (యూటీటీ) ఆరో సీజన్లో పీబీజీ పుణె జాగ్వర్స్ బోణీ కొట్టింది. ఆదివారం అహ్మదాబాద్‌లోని ఎకా ఎరీనా వేదికగా జరిగిన మ్యాచ్‌లో పుణె జాగ్వర్స్.. 9-6తో యూ ముంబా టీటీపై విజయం సాధించింది. పురుషుల సింగిల్స్‌లో లిలియన్ బార్డెట్.. 2-1తో అల్వరొపై, మహిళల సింగిల్స్‌లో బెర్నడెట్.. 2-1తో మెష్రెఫ్ను ఓడించి ముంబైకి శుభారంభం అందించారు.
కానీ మిక్స్డ్ డబుల్స్‌లో బెర్నెడెట్/ఆకాశ్ పాల్ ద్వయం.. 1-2తో మెష్రెఫ్/అనిర్బన్ చేతిలో ఓడారు. మరో పురుషుల సింగిల్స్ పోరులో ఆకాశ్.. 1-2తో అనిర్బన్ చేతిలో ఓడిపోగా కీలకమైన రెండో మహిళల సింగిల్స్‌లో రీతా.. 3-0తో స్వస్తికను ఓడించి పుణెకు విజయాన్ని కట్టబెట్టింది.