Viral Video | ఈ ప్రపంచంలో క్రికెట్ అభిమానులు కోట్ల మంది ఉన్నారు. ఒక్కో అభిమాని.. ఒక్కో క్రికెటర్‌ను ఇష్టపడుతారు. మరి తనకు ఇష్టమైన క్రికెటర్‌తో క్రికెట్ ఆడే అవకాశం వస్తే ఎలా ఉంటుందంటే.. ఊహించుకుంటేనే అద్భుతమనిస్తుంది. ఆ అవకాశం వస్తే ఏ అభిమాని కూడా వదులుకోడు. తప్పనిసరిగా ఆ క్రికెటర్‌తో ఆడి తీరుతారు. అలాంటి అవకాశమే ఓ మహిళా డాక్టర్‌కు వచ్చింది. అది కూడా పాకిస్తాన్ మాజీ క్రికెటర్ యూనస్ ఖాన్‌తో.
ఇంగ్లండ్‌కు చెందిన అఫ్జల్ వృత్తిరీత్యా డాక్టర్. ఆమె గతంలో ఓ జట్టు తరపున క్రికెట్ ఆడేవారు. అంతే కాదు కామెంటర్, కోచ్ కూడా. ఈ నేపథ్యమున్న డాక్టర్ అఫ్జల్‌కు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ యూనస్ ఖాన్‌తో క్రికెట్ ఆడే అవకాశం వచ్చింది. అదేదో ప్లే గ్రౌండ్లో కాదు. తన ఇంటి వెనుకాల ఉన్న గ్రౌండ్‌లోనే. సల్వార్ కమిజ్ ధరించిన అఫ్జల్.. యూనస్ ఖాన్ బౌలింగ్ చేయగా, ఆమె బ్యాటింగ్ చేసి అందరినీ ఉత్సాహపరిచారు.
యూనస్ ఖాన్ 2017లో క్రికెట్ నుంచి రిటైర్మెంట్ అయ్యారు. టెస్ట్ క్రికెట్లో అత్యుత్తమ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌గా ఖాన్ పేరుగాంచాడు.
ఈ సందర్భంగా డాక్టర్ అఫ్జల్ తాను క్రికెట్ ఆడిన వీడియోను ట్విట్టర్లో షేర్ చేశారు. ఓ గొప్ప క్రికెటర్‌తో తన గార్డెన్లో సల్వార్ కమిజ్ ధరించి క్రికెట్ ఆడడం గొప్ప అనుభూతి. గౌరవప్రదమైన యూనస్ఖాన్తో క్రికెట్ ఆడటం గొప్ప ఫీలింగ్ అని అఫ్జల్ పేర్కొన్నారు.
Playing cricket in the garden in my salwar kameez with one of the greatest cricketers the sport has produced is what dreams are made of! Such a humble and respectful human being is @YounusK75 #Cricket 💚 pic.twitter.com/X3DjOKqIJv
— Dr Samara Afzal (@SamaraAfzal) July 3, 2023