UK Club Cricket : ప్రపంచ క్రికెట్లో మరో సంచలనం. అలాఅనీ బ్యాటర్లు సెంచరీలతో రికార్డుల మోత మోగించలేదు. కానీ, ఒక టీమ్ స్వల్ప స్కోర్‌కే ఆలౌట్ అయిన జట్టుగా చెత్త రికార్డు మూటగట్టుకుంది. భారీ ఛేదనలో ప్రత్యర్థి బౌలర్ల దెబ్బకు కేవలం 2 పరుగులకే 10 వికెట్లు కోల్పోయింది ఒక జట్టు. ఈ రెండు పరుగుల్లో ఒకటి వైడ్ రూపంలో వచ్చిందే. అంటే.. సదరు టీమ్ ఒకే ఒక రన్ చేసి ఆలౌటయ్యింది. దాంతో, ఇదేంటీ? అని అభిమానులు నోరెళ్లబెడుతున్నారు. అసలు అదేలా సాధ్యం అనుకుంటున్నారా.. అయితే.. యూకే క్లబ్ క్రికెట్లో జరిగిన ఈ మ్యాచ్ సంగతులు మీరు తెలుసుకోవాల్సిందే.
ఈ టీ20 యుగంలో బ్యాటర్లు విధ్వంసక బ్యాటింగ్‌తో అలరిస్తుంటే.. యూకే క్లబ్ క్రికెట్ జట్టు రిచ్‌మండ్స్ ఫోర్త్ ఎక్స్ఐ (Richmond’s Fourth XI) క్రికెటర్లు మాత్రం ఘోరంగా విఫలమయ్యారు. దాంతో, మిడిల్సెక్స్ లీగ్‌లో భాగంగా మే 24న నార్త్ లండన్(North London)తో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 2 పరుగులకే కుప్పకూలింది. ప్రత్యర్థి నిర్దేశించిన 427 పరుగుల ఛేదనలో రిచ్‌మండ్స్ ఇన్నింగ్స్ పేకమేడను తలపించింది.
SHOCKING Scorecard Alert!
In the Middlesex County League, North London CC posted a mammoth 426/7 in 45 overs.In reply, Richmond 4th XI were bowled out for just 2 runs in 5.4 overs!
1 run from the bat
1 wide
That’s it!🪙 Richmond won the toss & chose to bowl first!
Social… pic.twitter.com/EJZwCNJdGz— The2States (@thetwostates) May 27, 2025
నార్త్ లండన్ ఆటగాళ్లు రెచ్చిపోయి ఆడిన చోట రిచ్‌మండ్స్ ప్లేయర్లు మాత్రం తేలిపోయారు. వచ్చినవాళ్లు వచ్చినట్టు పెవిలియన్ చేరారు. ఒకరిద్దరు కాదు ఏకంగా 9 మంది డకౌట్ అయ్యారు. 5.4 ఓవర్లలోనే ఆ జట్టు రెండంటే రెండే పరుగులకు 10 వికెట్లు కోల్పోయి భారీ ఓటమి ఖాతాలో వేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన నార్త్ లండన్ 45 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 426 పరుగులు చేసింది. ఇందులో రిచ్‌మండ్స్ బౌలర్లు 98 ఎక్స్‌ట్రాలు ఇవ్వడం గమనార్హం.