న్యూఢిల్లీ: జాతీయ యోగాసన క్రీడా సమాఖ్య (ఎన్వైఎస్ఎఫ్) అధ్యక్షుడిగా ఉదిత్ సేఠ్ ఎంపిక కానున్నాడు. ఐవీ బసవరెడ్డి రాజీనామాతో తదుపరి అధ్యక్షుడిగా.. ఉదిత్ సేఠ్ను ఎంపిక చేసేందుకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. శనివారం సమావేశమైన కార్యనిర్వాహక కమిటీ (ఈసీ) సభ్యులు ఏకగ్రీవంగా అతడి అభ్యర్థిత్వానికి మద్దతు పలికారు. ఉదిత్ ప్రపంచ యోగాసనకు ఉపాధ్యక్షుడిగా ఎంపికయ్యాడు. 2020 నవంబర్ 27న ప్రారంభమైన ఎన్వైఎస్ఎఫ్ యోగాసనాలను ప్రోత్సహించేందుకు పని చేస్తున్నది.