U-19 World Cup 2024: అండర్ – 19 వరల్డ్ కప్‌లో మన యువసేన ఇదే.. హైదరాబాద్ కీపర్‌కు చోటు
U-19 World Cup 2024: డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగనున్న టీమిండియాను ప్రస్తుతం అండర్ - 19 ఆసియాకప్‌లో యువ భారత్‌ను నడిపిస్తున్న...
U-19 World Cup 2024: వచ్చే ఏడాది దక్షిణాఫ్రికా వేదికగా జరగాల్సి ఉన్న అండర్ – 19 పురుషుల వన్డే ప్రపంచకప్‌లో ఆడబోయే జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రకటించింది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగనున్న భారత్‌ను ప్రస్తుతం అండర్ – 19 ఆసియాకప్‌లో యువ భారత్‌ను నడిపిస్తున్న ఉదయ్ సహరన్కే ప్రపంచకప్‌లోనూ భారత జట్టు పగ్గాలను అప్పజెప్పింది. మిడిలార్డర్ బ్యాటర్ అయిన ఈ పంజాబ్ కుర్రాడు సారథ్యంలో యువ భారత్.. జనవరి 20న బంగ్లాదేశ్‌తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది.
15 మంది సభ్యులతో కూడిన ఈ జట్టులో అండర్ – 19 ఆసియాకప్ లో ఉన్న ఆటగాళ్లకే అవకాశమిచ్చింది. బ్యాటర్లుగా అర్షిన్ కులకర్ణి, ఆదర్శ సింగ్, రుద్ర మయూర్ పటేల్, సచిన్ దాస్లపై భారత్ భారీ ఆశలు పెట్టుకుంది. ఈ జట్టులో హైదరాబాదీ వికెట్ కీపర్ బ్యాటర్ అరవెల్లి అవనీష్ రావు ఫస్ట్ ఛాయిస్ వికెట్ కీపర్‌గా ఎంపికయ్యాడు. అతడికి బ్యాకప్‌గా హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన ఇన్నేశ్ మహారాజన్ ఉన్నాడు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన నమన్ తివారి, బరోడా పేసర్ రాజ్ లింబానిలు పేస్ భారాన్ని మోయనున్నారు. జనవరి 19 నుంచి ఫిబ్రవరి 11 వరకూ దక్షిణాఫ్రికాలోని ఐదు వేదికలలో ఈ టోర్నీ జరుగనుంది.
India U-19 team for the World Cup:
Arshin, Adarsh Singh, Rudra Patel, Sachin Dhas, Priyanshu Moliya, Musheer, Uday Saharan (C), Avanish Rao, Saumy Pandey, Murugan Abhishek, Innesh Mahajan, Dhanush Gowda, Raj Limbani, Naman Tiwari, Aradhya Shukhla. pic.twitter.com/zn0nSDnOlc
— Johns. (@CricCrazyJohns) December 12, 2023
వరల్డ్ కప్‌కు భారత్ అండర్ -19 జట్టు: అర్షిన్ కులకర్ణి, ఆదర్శ్ సింగ్, రుద్ర మయూర్ పటేల్, సచిన్ దాస్, ప్రియాన్షు మోలియ, ముషీర్ ఖాన్, ఉదయ్ సహరన్, అరవెల్లి అవినాశ్ రావు (వికెట్ కీపర్) , సౌమీ కుమార్ పాండే, మురుగన్ అభిషేక్, ఇన్నేశ్ మహారాజన్ (వికెట్ కీపర్), ధనుష్ గౌడ, ఆరాధ్య శుక్లా, రాజ్ లింబాని, నమన్ తివారి
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

