దుబాయ్ : తీవ్ర చర్చకు దారి తీసిన టూ-టైర్ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ప్రారంభమయ్యే సూచనలు కనిపించడం లేదు. పూర్తిస్థాయి సభ్యదేశాలకు తోడు అసోసియేట్ దేశాలను రెండు గ్రూపులుగా విభజిస్తూ టెస్టు చాంపియన్‌షిప్ నిర్వహించాలన్న ఐసీసీ ఆలోచనను మెజార్టీ దేశాలు వ్యతిరేకించిన నేపథ్యంలో వెనుకకు తగ్గాల్సి వచ్చింది. దీంతో టూ-టైర్ పద్ధతి గాకుండా రానున్న డబ్ల్యూటీసీ సైకిల్(2027)లో 12 పూర్తిస్థాయి సభ్యదేశాలకు ఆడే అవకాశం కల్పించనున్నారు.
కివీస్ మాజీ క్రికెటర్ రోజర్ ప్రతిపాదించిన టూ-టైర్ సిస్టమ్‌కు ఇటీవల దుబాయ్‌లో జరిగిన ఐసీసీ భేటీలో సరైన మద్దతు లభించలేదు. ‘ఐసీసీ సమావేశంలో టూ-టైర్ సిస్టమ్‌పై చర్చించేందుకు కొన్ని దేశాల బోర్డులు సమ్మతించలేదు. అందుకే 12 జట్ల పద్ధతి ద్వారా ఒక జట్టు మరో జట్టుతో ఆడే అవకాశం లభిస్తుంది’అని ఐసీసీ వర్గాలు పేర్కొన్నాయి. వన్డే సూపర్ లీగ్‌ను పునరుద్ధరణ చేసేందుకు ఐసీసీ సిద్ధమవుతున్నది.