హైదరాబాద్, ఆట ప్రతినిధి: వయసు కేవలం సంఖ్య మాత్రమే అని మరోమారు రుజువు అయ్యింది. ఎనిమిది పదుల వయసులోనూ మర్రి లక్ష్మణ్‌రెడ్డి తనలో సత్తా తగ్గలేదని నిరూపిస్తున్నారు. నేషనల్ మాస్టర్స్ గేమ్స్‌లో హైదరాబాద్ మాస్టర్ స్విమ్మర్ లక్ష్మణ్‌రెడ్డి రెండు పసిడి పతకాలతో మెరిశారు.
మాస్టర్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో 80 వయసు విభాగం 100మీ బ్రెస్ట్ స్ట్రోక్ రేసును లక్ష్మణ్‌రెడ్డి 16.59 సెకన్లలో ముగించి అగ్రస్థానంలో నిలిచాడు. మరోవైపు 100మీ ఫ్రీ స్టయిల్లో 3నిమిషాల 32.50 సెకన్ల టైమింగ్‌తో మరో పసిడి పతకాన్ని ఖాతాలో వేసుకున్నారు.