IPL 2025 : సొంతగడ్డపై లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్(LSG) నిదానంగా సాగుతోంది. 25 పరుగుల వద్ద తొలి వికెట్ పడడంతో స్కోర్ వేగం తగ్గింది. అయితే.. యశ్ దయాల్ వేసిన 4 వ ఓవర్లో రెచ్చిపోయాడు రిషభ్ పంత్ (20 నాటౌట్) . ఒంటిచేత్తో సిక్సర్ బాదిన ఈ లెఫ్ట్ హ్యాండర్.. ఆ తర్వాత రెండు ఫోర్లతో 18 రన్స్ పిండుకున్నాడు. ఆ తర్వాతి ఓవర్లో భువనేశ్వర్ 4 పరుగులే ఇవ్వగా.. తుషార కూడా 7 రన్స్ మాత్రమే ఇచ్చాడు. ఓపెనర్ మిచెల్ మార్ష్ 15 క్రీజులో ఉన్నాడు. దాంతో, లక్నో వికెట్ నష్టానికి పవర్ ప్లేలో 55 పరుగులు స్కోర్ చేసింది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నో జట్టు ఆరంభంలోనే తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ మాథ్యూ బ్రీట్జ్(14)ను నువాన్ తుషార యార్కర్‌తో క్లీన్ బౌల్డ్ చేశాడు. షాట్ ఆడాలనుకున్న బ్రీట్జ్.. బంతిని మిస్ అవ్వగా అది మెరుపు వేగంతో ఆఫ్ స్టంప్ వికెట్‌ను ఎగురగొట్టింది. 25వద్ద లక్నో మొదటి వికెట్ పడింది. మిచెల్ మార్ష్, రిషభ్ పంత్(0)లు.. ఇన్నింగ్స్ నిర్మించే బాధ్యత తీసుకున్నారు.
On target 🎯
Nuwan Thushara makes amends for the first time this season ☝️
Updates ▶ https://t.co/h5KnqyuYZE #TATAIPL | #LSGvRCB pic.twitter.com/gqboTYN6zU
— IndianPremierLeague (@IPL) May 27, 2025