కులకచర్ల: వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండలం మరికల్ గ్రామానికి చెందిన తులసి..అంతర్జాతీయ సాఫ్ట్‌బాల్ టోర్నీకి ఎంపికైంది. తైవాన్ వేదికగా జూన్ 10 నుంచి జరిగే సాఫ్ట్‌బాల్ టోర్నీకి వెళ్లేందుకు తులసికి పాస్‌పోర్టు మంజూరు అయ్యింది. అయితే తన కూతురుకు సాఫ్ట్‌బాల్ టోర్నీలో ఆడేందుకు అవకాశం వచ్చిందని క్రీడా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ దృష్టికి తులసి తండ్రి తీసుకెళ్లారు.
వెంటనే స్పందించిన మంత్రి తైవాన్ వెళ్లేందుకు ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా సాయం చేస్తామని హామీ ఇచ్చారు. మంత్రి నిర్ణయంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గురుకులంలో చదువుతున్న తులసికి అంతర్జాతీయ టోర్నీలో ఆడే అవకాశం రావడం అభినందనీయమని అన్నారు. తైవాన్‌లో జరిగే సాఫ్ట్‌బాల్ చాంపియన్‌షిప్‌నకు దేశవ్యాప్తంగా 12 మందిని ఎంపికచేయగా, రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న తులసిని మంత్రి ఘనంగా సన్మానించారు.