Rinku Singh-Priya Saroj | టీమిండియా యువ బ్యాట్స్‌మెన్ రింకు సింగ్ ఓ ఇంటివాడు కాబోతున్నాడని.. సమాజ్‌వాదీ పార్టీకి చెందిన మచిలీషహర్ ఎంపీ ప్రియా సరోజ్‌తో నిశ్చితార్థం ప్రచారం జరిగింది. ఈ విషయంలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పెద్ద సంఖ్యలో నెటిజన్లు వారికి శుభాకాంక్షలు తెలుపుతూ వచ్చారు. అయితే, నిశ్చితార్థం వార్తలపై ఎంపీ ప్రియా సరోజ్ తండ్రి తుఫానీ సరోజ్ మీడియాతో మాట్లాడారు. నిశ్చితార్థం వార్తలు వట్టి పుకార్లేనని స్పష్టం చేశారు. వాటిని ఎవరూ నమ్మొద్దని.. అందులో ఏమాత్రం నిజం లేదన్నారు.
టీమిండియా యువ ఆటగాడు రింకు సింగ్ గత రెండేళ్లుగా బ్యాట్‌తో రాణిస్తున్నాడు. త్వరలో ఇంగ్లాండ్‌తో జరుగనున్న టీ20 సిరీస్‌లో పాల్గొననున్నాడు. ఈ నెల 22 నుంచి ఇంగ్లాండ్‌తో సిరీస్ జరుగనున్న విషయం తెలిసిందే. ఇక ప్రియా సరోజ్ గతేడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొందారు. బీజేపీ అభ్యర్థిపై 35వేలకుపైగా ఓట్ల తేడాతో గెలిచి పార్లమెంట్లో అడుగుపెట్టారు. పార్లమెంట్‌కు ఎన్నికైన రెండో పిన్న వయస్కురాలిగా నిలిచింది. ఆమె వసయు 26 సంవత్సరాలు మాత్రమే. ఆమె యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ నుంచి బీఏ డిగ్రీతో పాటు నోయిడాలోని అమిటీ యూనివర్సిటీ నుండి ఎల్ఎల్బీ పట్టా అందుకున్నారు. ఆమె స్వస్థలం యూపీలోని వారణాసి. ప్రియా సరోజ్ తండ్రి తుఫానీ సరోజ్ సైతం మూడుసార్లు ఎంపీగా ఎన్నిక కాగా.. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
Rinku Singh gets engaged to Samajwadi Party MP Priya Saroj. 💍
– Many congratulations to them! ❤️ pic.twitter.com/7b7Hb0D2Em
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 17, 2025