బ్రిడ్జ్‌టౌన్: టీ20 వరల్డ్‌కప్‌లో ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో నమీబియా( Namibia) అద్భుత విజయాన్ని నమోదు చేసింది. సూపర్ ఓవర్ వరకు వెళ్లిన ఆ మ్యాచ్‌లో నమీబియా .. తన స్టన్నింగ్ షోతో టీ20 వలర్డ్కప్కు అట్రాక్షన్ తీసుకువచ్చింది. సూపర్ ఓవర్లో నమీబియా తొలుత 21 రన్స్ చేయగా.. ఒమన్ కేవలం 10 రన్స్ మాత్రమే చేసి ఓటమి పాలైంది. గ్రూప్ బీలో భాగంగా బ్రిడ్జ్‌టౌన్‌లో జరిగిన మ్యాచ్‌లో తొలుత ఒమన్ జట్టు మొదట బ్యాటింగ్ చేసింది. ఆ జట్టు 19.4 ఓవర్లలో 109 పరుగులకే ఆలౌట్ అయ్యింది. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన నమీబియా 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 109 రన్స్ చేసింది. దీంతో మ్యాచ్ డ్రా అయ్యింది. ఆ తర్వాత జరిగిన సూపర్ ఓవర్లో నమీబియా విజయాన్ని సొంతం చేసుకున్నది. నమీబియా తరపున ఫాస్ట్ బౌలర్ రూబెన్ ట్రంపెల్మన్ తొలి రెండు బంతులకే రెండు వికెట్లు తీసి టీ20 చరిత్రలో కొత్త రికార్డును క్రియేట్ చేశాడు. దక్షిణాఫ్రికా సంతతికి చెందిన ట్రంపెల్మన్.. వరుస బంతుల్లో కశ్యప్ ప్రజాపతి, అకిబ్ ఇలియాస్ వికెట్లను తీశాడు.
David Wiese’s stunning performance in the Super Over helps Namibia overcome Oman in an enthralling #T20WorldCup 2024 encounter 🔥#NAMvOMAhttps://t.co/J8loCqDYAm
— T20 World Cup (@T20WorldCup) June 3, 2024