హైదరాబాద్, ఆట ప్రతినిధి: సీబీఎస్ఈ క్లస్టర్ టేబుల్ టెన్నిస్ చాంపియన్షిప్లో త్రిశాల్రాజ్కుమార్, శ్రీశృతి విజేతలుగా నిలిచారు. ఆదివారం జరిగిన అండర్-19 బాలుర ఫైనల్లో త్రిశాల్(శ్రీ ప్రకాశ్ సినర్జీ స్కూల్) 3-0(11-9, 11-8, 11-5)తో క్రిష్ సప్తర్షి(చిరెక్ ఇంటర్నేషనల్)పై అద్భుత విజయం సాధించాడు. మరోవైపు బాలికల విభాగంలో శృతి( 3-2(3-11, 4-11, 11-5, 11-8, 12-10)తో సుశ్మిత(హ్యాపీ వ్యాలీ స్కూల్)పై గెలిచి టైటిల్ సొంతం చేసుకుంది. అండర్-17 విభాగంలో శౌర్యరాజ్ సక్సేనా, చైత్రా రెడ్డి విజేతలుగా నిలిచారు. మిగతా విభాగాల్లో మనోహర్, సమృద్ధి టైటిళ్లు దక్కించుకున్నారు.