Australia Open | సిడ్నీ: భారత యువ షట్లర్లు పుల్లెల గాయత్రి గోపీచంద్-త్రిసా జాలీ జోడీ ఆస్ట్రేలియా ఓపెన్‌లో శుభారంభం చేసింది. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్‌టూర్ సూపర్ -500 టోర్నీ మహిళల డబుల్స్ తొలి రౌండ్లో మంగళవారం గాయత్రి-త్రిసా జంట 21-16, 21-17తో కెనడా జోడీపై గెలిచింది. నిరుడు కామన్వెల్త్ గేమ్స్‌లో కాంస్య పతకం నెగ్గిన ఈ జోడీ.. వరుస గేమ్‌ల్లో ప్రత్యర్థిని చిత్తుచేసింది. ఇతర డబుల్స్ మ్యా చ్ల్లో సిక్కిరెడ్డి-ఆర్తి, అశ్విని-తనీషా జోడీలు పరాజయం పాలయ్యాయి.