న్యూఢిల్లీ : భారత టాప్ మహిళా ట్రిపుల్ జంపర్ ఐశ్వర్య బాబు పై జాతీయ ఉత్ప్రేరక నిషేధ సంస్థ(నాడా) నాలుగేండ్ల నిషేధం విధించింది. నిషేధిత జాబితాలోని ఉత్ప్రేరకాన్ని వాడినందుకు ఈ నిషేధం విధించినట్టు నాడా వెల్లడించింది.
అయితే దీనిపై అప్పీల్ చేసుకునేందుకు ఐశ్వర్యకు మార్చి 6వ తేదీవరకు అవకాశం ఇచ్చింది. గత యేడాది జూన్లో చెన్నైలో జరిగిన జాతీయ అంతర్ రాష్ట్ర అథ్లెటిక్స్ చాంపియన్షిప్ సందర్భంగా సేకరించిన ఐశ్వర్య నమూనాలో నిషేధిత ఒస్టారిన్ అనే ఉత్ప్రేరకం వాడినట్టు తేలడంతో నిషేధం విధించారు. ఆ చాంపియన్షిప్లో ఐశ్వర్య 14.14 మీ.తో జాతీయ రికార్డు నెలకొల్పి స్వర్ణం దక్కించుకుంది.