Caribbean Premier League 2023 : వెస్టిండీస్ వేదికగా జరుగుతున్న కరీబియన్ ప్రీమియర్ లీగ్ ఫైనల్(Caribbean Premier League 2023) ఫైట్‌కు కొన్ని గంటలే ఉంది. రేపు జరుగబోయే టైటిల్ పోరులో గయానా అమేజాన్ వారియర్స్(Guyana Amazon Warriors), ట్రిన్బగో నైట్ రైడర్స్(Trinbago Knight Riders) జట్లు తలపడనున్నాయి. గయానా జట్టుకు ఇది ఆరో ఫైనల్ కాగా టీకేఆర్కు నాలుగో ఫైనల్ కావడం విశేషం. కానీ, గత ఐదు సార్లు గయానా వారియర్స్ రన్నరప్‌తోనే సరిపెట్టుకుంది.
మరోవైపు నైట్ రైడర్స్ మాత్రం నాలుగు పర్యాయాలు చాంపియన్‌గా నిలిచింది. ఈ టోర్నీలో ఈ రెండు జట్లకు ఇది రెండో ఫైనల్. దాంతో, ఇమ్రాన్ తాహిర్(Imran Tahir) సారథ్యంలోని గయానా జట్టు టీకేఆర్ను ఓడించి, కప్పు కొట్టాలనే లక్ష్యంతో ఉంది.
Leading the Warriors to the Finals what a season for captain Tahir. #CPL23 #ImranTahir #CricketPlayedLouder #BiggestPartyInSport pic.twitter.com/QjHJqFWajo
— CPL T20 (@CPL) September 23, 2023
Waqar Salamkheil makes taking wickets look easy as he helps take the Trinbago Knight Riders to the final in CPL 2023. #CPL23 #CricketPlayedLouder #BiggestPartyInSport pic.twitter.com/dg8ZlYkD7H
— CPL T20 (@CPL) September 23, 2023
క్వాలిఫయర్ 2 మ్యాచ్‌లో గయానా అమెజాన్ వారియర్స్ 81 రన్స్‌తో జమైకా తలైవాస్‌పై విజయం సాధించింది. మొదట ఆడిన గయానా జట్టు 6 వికెట్ల నష్టానికి 182 రన్స్ కొట్టింది. ఆజం ఖాన్(54), షైహోప్(40) రాణించారు. లక్ష్య ఛేదనలో జమైకా జట్టు 110 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టులో ఇమద్ వసీం(43) టాప్ స్కోరర్. డ్వేన్ ప్రిటోరియస్ రెండు కీలక వికెట్లు తీసి గయానాను గెలిపించాడు.