హైదరాబాద్, నవంబర్ 20(నమస్తే తెలంగాణ): ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ (ఈఎమ్ఆర్ఎస్) నేషనల్ స్పోర్ట్స్ మీట్ 2025లో తెలంగాణ గిరిజన విద్యార్థులు ఓవరాల్ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్నారు. రూర్కేలా-సుందర్ఘడ్లో ఈనెల 11నుంచి 15వ తేదీ వరకు ఈఎమ్ఆర్ఎస్ నాల్గవ నేషనల్ స్పోర్ట్స్ మీట్- 2025 జరిగింది.
ఈ పోటీల్లో తెలంగాణలోని 23 ఈఎమ్ఆర్ఎస్ సంస్థల నుంచి 580 మంది విద్యార్థులు పోటీపడ్డారు. అథ్లెటిక్స్, షూటింగ్, బాక్సింగ్, జిమ్నాస్టిక్స్, జూడో, యోగా, బాసెట్బాల్, స్విమ్మింగ్, తైక్వాండో, వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్, ఖో-ఖో తదితర విభాగాల్లో కలిపి మొత్తం 230 పతకాలు సాధించారు. నేషనల్ స్పోర్ట్స్ మీట్లో ఓవరాల్ చాంపియన్‌షిప్‌తో పాటు, ఓవరాల్ టీమ్ చాంపియన్‌షిప్‌ను సైతం మన విద్యార్థులు కైవసం చేసుకున్నారు.
అద్భుత ప్రతిభ కనబరిచిన సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖల మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ సచివాలయంలో తన చాంబర్లో గురువారం సన్మానించారు. భవిష్యత్‌లో మరిన్ని జాతీయ-అంతర్జాతీయ పతకాలను సాధించాలని ఆకాక్షించారు. కార్యక్రమంలో సొసైటీ సెక్రటరీ సీతాలక్ష్మి, ఈఎమ్ఆర్ఎస్ అధికారులు, 68 మంది ఎసార్ట్ టీచర్లు పాల్గొన్నారు.