హాంగ్జౌ: ప్రతిష్ఠాత్మక బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నీలో భారత యువ ద్వయం గాయత్రి గోపీచంద్, త్రిసా జాలీ జోడీ పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన మహిళల డబుల్స్ గ్రూపు-ఏలో గోపీచంద్, త్రిసా ద్వయం 17-21, 13-21తో జపాన్‌కు చెందిన మత్సుయమ, చిహారు జంట చేతిలో ఓడింది. ఇటీవలే సయ్యద్ మోడీ టోర్నీ గెలిచిన జోరు కనిపించిన గాయత్రి, త్రిసా…ప్రపంచ నంబర్ఫోర్ జోడీ నుంచి గట్టి పోటీ ఎదురైంది. వీరి నిష్క్రమణతో భారత పోరు ముగిసింది.