ఓడెన్స్: డెన్మార్క్ ఓపెన్ సూపర్ 750 టోర్నమెంట్లో రెండో రోజూ భారత్‌కు నిరాశజనక ఫలితాలే వచ్చాయి. మహిళల డబుల్స్‌లో త్రిసా జాలీ, గాయత్రి గోపీచంద్ జోడీ 21-19, 17-21, 15-21తో పీర్లీ టాన్, మురళీధరన్ తిన్నా(మలేషియా) చేతిలో పోరాడి ఓడింది. మిక్స్డ్ డబుల్స్‌లో సుమిత్-సిక్కి రెడ్డి జంట.. 22-20, 19-21, 22-24తో కెవిన్ లీ, ఎలియానా ఝంగ్ (కెనడా) చేతిలో ఓటమి పాలయ్యింది.